Lucknow, May 27: హెచ్ఐవి పాజిటివ్ కలిగిన కరోనావైరస్ పాజిటివ్ రోగి (HIV+ Covid Patient Recovered) కేవలం ఆరు రోజుల్లోనే ఈ వైరస్ భారీ నుండి కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి
వివరాల్లోకెళితే.. ఢిల్లీ నుంచి గోండా వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తలకు గాయాలు కావడంతో అతనిని కేజీఎంయూలోని (George's Medical University) ట్రామా సెంటర్‌కు తీసుకువచ్చారు. చికిత్స సమయంలో వైద్యులకు అతను హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పాడు. అలాగే ప్రస్తుతం అందుకు సంబంధించిన మందులు వాడుతున్నానని వైద్యులతో చెప్పాడు. ఇదిలా ఉంటే అతని COVID-19 పరీక్షలు చేయగా నివేదిక కూడా పాజిటివ్ గా వచ్చింది. డాక్టర్లు అతనికి వైద్యం అందించగా కేవలం ఆరు రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.
కెజిఎంయు వైస్ ఛాన్సలర్ భట్ మాట్లాడుతూ.. రోగి హెచ్‌ఐవి మరియు కరోనా పాజిటివ్‌గా ఉన్న మొదటి కేసు ఇదేనని, హెచ్‌ఐవి రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున, కేవలం ఆరు రోజుల్లో ఆయన కోలుకోవడం వైద్యులకు ధైర్యాన్ని పెంచేదని చెప్పారు. రోగికి తలకు గాయం కలిగింది మరియు గాయం కారణంగా కొంతకాలం బాధపడ్డాడు, కాని ఇప్పుడు అతను కోలుకున్నాడు మరియు 14 రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలనే సలహాతో మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో ప్రమాదమేమి లేదు, వైద్యుల పర్యవేక్షణలో వాడండి, స్పష్టం చేసిన ఐసీఎంఆర్, ఇదివరకే దీనిపై నిషేధం విధించిన డబ్ల్యూహెచ్‌ఓ
ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ... ‘ఇలాంటి కేసు రావడం ఇదే ప్రథమం. ప్రొటోకాల్ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లో అతడికి కరోనా నయమైంది. చికిత్స అనంతరం రెండు సార్లు కరోనా నెగిటీవ్‌గా రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం రెండు వారాల పాటు అతడిని హోం క్వారంటైన్‌లో ఉండమని చెప్పాం. గతంలో ఓ క్యాన్సర్ పేషెంట్‌కు కూడా కరోనా పూర్తిగా నయమయ్యింది. డయబెటీస్ ఉన్న వారు కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు’ అని వైద్యులు తెలిపారు.