New Delhi, May 27: కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో (Hydroxychloroquine) సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. కాగా కోవిడ్-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన విషయం విదితమే. అయితే మరుసటి రోజు ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్రయల్స్ ఆపేయండి, ఈ డ్రగ్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
భారత్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడకంతో సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్నట్లు వెల్లడి కాలేదని (No side-effects of HCQ) ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ (ICMR DG Balram Bhargava) పేర్కొన్నారు. ఈ మందును రోగులు విధిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడేందుకు తాము సిఫార్సు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Here's ANI Tweet
Lot of drugs are being repurposed for #COVID19...Taking biological plausibility, in-vitro data&safety of this drug (HCQ), we recommened it under strict medical supervision...Based on risk benefit we found that possibly we should not deny our health workers from using it: DG, ICMR pic.twitter.com/f8LEpK9F1a
— ANI (@ANI) May 26, 2020
ప్రజారోగ్య సిబ్బంది కోవిడ్-19 నియంత్రణకు ముందుజాగ్రత్తగా ఈ ఔషధాన్ని వాడాలని సూచిస్తున్నామని, అయితే ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకోరాదని, ఆహారం తీసుకున్న తర్వాతే దీన్ని వాడాలని చెప్పారు. కోవిడ్-19 చికిత్స కోసం ఈ మందును తీసుకునేవారు సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకునేందుకు ఈసీజీ పరీక్ష చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.