Coronavirus disease named Covid-19 vaccine could be ready in 18 months, says WHO (Photo-Getty)

Geneva, May 26: యాంటీ మ‌లేరియా ఔష‌ధం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ (hydroxychloroquine) కోవిడ్‌19 (COVID-19) చికిత్స కోసం కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ డ్ర‌గ్ క‌రోనా చికిత్స (COVID-19 Treatment) కోసం త‌యారు చేసింది కాదు. కానీ కోవిడ్ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ మాత్ర‌లు వేసుకుంటున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేసినట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొన్న‌ది. హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఈ డ్రగ్‌ వాడకం వల్ల కోవిడ్‌-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్‌ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాలు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను వాడ‌డం నిలిపేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. హెచ్‌సీక్యూ వినియోగంపై డేటా సేఫ్టీ మానిట‌రింగ్ బోర్డు స‌మీక్షిస్తున్న‌ద‌ని, దీనిలో భాగంగానే ఆ మాత్ర‌ల‌ను వాడ‌డం లేద‌ని టెడ్రోస్ తెలిపారు. హైడ్రాక్సీ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ‌ని ద ల్యాన్సెట్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌, క్లోరోక్వీన్ లాంటి మందుల‌ను కేవ‌లం మ‌లేరియా పేషెంట్లు వాడాల‌ని టెడ్రోస్ తెలిపారు. చైనాలో కరోనా పోలేదు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి, కీలక వ్యాఖ్యలు చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ను వాడుతున్నారు.

గత వారం బ్రెజీల్‌ ఆరోగ్యమంత్రి ఒకరు తేలికపాటి కోవిడ్‌-19 కేసులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటీ మలేరియా క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫారసు చేశారు. అయితే ఈ రెండు మందుల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది