Rahul Gandhi: రిమోట్ కంట్రోల్ అంటూ అవమానిస్తారా? వాళ్లకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేదా? కాంగ్రెస్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, ఎన్నికల్లో అక్కడే ఓటు వేస్తానని ప్రకటన

ప్రజలను అర్థం చేసుకోగలిగే దృక్పథం, ప్రజల పట్ల అవగాహన ఉందన్నారు. అలాంటి వ్యక్తులనుద్దేశించి ‘రిమోట్‌ కంట్రోల్‌’ (Remote-Control) అనడం అంటే వారిని అవమానించడమే అవుతుందని రాహుల్‌ (Rahul) పేర్కొన్నారు.

Bharat Jodo Yatra (Credits: Twitter)

Tumukur, OCT 08: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు (Congress President poll) త్వరలో ఓటింగ్ జరగనుంది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), శశిథరూర్‌ (Shashi Throor) బరిలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నిరాకరించడంతో గాంధీయేతర వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అయితే, అభ్యర్థి ఎవరైనా ‘రిమోట్‌ కంట్రోల్‌’ (Remote-Control) గాంధీలదేనన్న విమర్శలు వినవస్తున్నాయి. భారత్‌ జోడో యాత్రలో (Bhart Jodo Yatra) భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా.. దీనిపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచిన ఇద్దరు వ్యక్తులకూ సమాజంలో వారికంటూ ఓ స్థానం ఉందని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజలను అర్థం చేసుకోగలిగే దృక్పథం, ప్రజల పట్ల అవగాహన ఉందన్నారు. అలాంటి వ్యక్తులనుద్దేశించి ‘రిమోట్‌ కంట్రోల్‌’ (Remote-Control) అనడం అంటే వారిని అవమానించడమే అవుతుందని రాహుల్‌ (Rahul) పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యాత్ర గురించి మాట్లాడుతూ.. యాత్రలో తానొక్కడినే పాల్గొనడం లేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో విసిగిన లక్షల జనం యాత్రలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల కోసం ఈ యాత్ర కాదని, బీజేపీ (BJP)- ఆరెస్సెస్‌ (RSS) తీసుకొస్తున్న విభజన నుంచి ప్రజలను ఐక్యం చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వికేంద్రీకరణ విద్యావిధానం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు.

Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం, నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయం  

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు అక్టోబర్‌ 17న జరిగే పోలింగ్‌లో రాహుల్‌ గాంధీ కర్ణాటక నుంచే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాహుల్‌ సహా పాదయాత్రలో పాల్లొంటున్న 40 మంది నేతలూ బళ్లారిలో యాత్రా ప్రదేశం నుంచే ఓటు వేస్తారు. ఆ రోజు యాత్రకు విరామం ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే వారి కోసం యాత్రాస్థలిలోనే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎన్నికల అథారిటీ నిర్ణయించిందన్నారు.

 Rahul Gandhi On Agnipath: ప్రధాని మోదీ మాఫీవీర్ గా మారి, అగ్నిపథ్ స్కీంను వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్...   

అలాగే కర్ణాటకకు చెందిన పీసీసీ సభ్యులు బెంగళూరులో ఓటు హక్కు వినియగించుకుంటారని చెప్పారు. అక్టోబర్‌ 19న కౌంటింగ్‌ నిర్వహిస్తామని, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుందని జైరాం రమేశ్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 18న భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుందని, 95 కిలోమీటర్ల తర్వాత మళ్లీ కర్ణాటకలోని రాయ్‌చూర్‌ చేరుకుంటుందని చెప్పారు. అనంతరం తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు.