Rajasthan Shocker: శాడిస్ట్ టీచర్, హోమ్ వర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టి చంపేశాడు, రాజస్థాన్‌లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో దారుణ ఘటన
విద్యార్థి హోమ్ వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు ఆ బాలుడిని (School Teacher Beats 13-Year-Old to Death) కొట్టి చంపాడు. పైగా అతడు చనిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడని ఆ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.
Jaipur, October 22: రాజస్థాన్‌లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి హోమ్ వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు ఆ బాలుడిని (School Teacher Beats 13-Year-Old to Death) కొట్టి చంపాడు. పైగా అతడు చనిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడని ఆ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలసర్ నివాసి ఓంప్రకాష్‌కు చెందిన 13 ఏండ్ల కుమారుడు ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ టీచర్ మనోజ్ కుమార్ తనను అకారణంగా కొడుతున్నట్లు తండ్రికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు.
కాగా, బుధవారం స్కూల్‌కు వెళ్లిన ఆ స్టూడెంట్‌ను హోంవర్క్ చేయలేదన్న (Not Completing Homework) కోపంతో టీచర్ మనోజ్ కర్రతో పలుమార్లు కొట్టాడు. దీంతో అతడు కింద పడి అచేతనంగా ఉన్నాడు. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి తండ్రి ఓంప్రకాష్‌కి ఫోన్ చేశాడు. హోంవర్క్ చేయకపోవడంతో తాను కొట్టగా అచేతనంగా పడిపోయాడని చెప్పాడు. తన కుమారుడ్ని చంపేశావా అని ఆయన అడగ్గా, చనిపోయినట్లుగా నటిస్తున్నాడని ఆ టీచర్ చెప్పాడు. దీంతో విద్యార్థి తండ్రి హుటాహుటిన స్కూల్‌కు చేరుకున్నాడు.
అక్కడ ఉన్న భార్యతో కలిసి కుమారుడ్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆ విద్యార్థిని టీచర్ కింద పడేసి చేతులు, కాళ్లతో పలుమార్లు గట్టిగా కొట్టాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి తండ్రి ఓంప్రకాష్ ఫిర్యాదుతో టీచర్ మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.