
వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది(Viral News). ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం. పిల్లి, గొర్రె(Couple of the Year)..జూకు వచ్చే సందర్శకుల హృదయాలను గెలుచుకుని ఉత్తమ జంటగా ఎంపిక కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మేరకు జూ నిర్వాహకులు పేస్ బుక్ ద్వారా అఫిషియల్‌గా(Ukraine zoo) ప్రకటించింది. జంతువుల మధ్య నిర్వహించిన ఈ పోటీలో గొర్రె- పిల్లి ఉత్తమ జంటగా ఎంపికైందని తెలిపారు.
విభిన్న జంతువుల మధ్య ఇలాంటి మిత్ర సంబంధం ఓడెస్సా జూలో మాత్రమే సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు విజేతల అవార్డు వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నాము అని తెలిపారు.
Cat and sheep are Couple of the Year 2025..
మసాజిక్ జూలో చాలా సుపరిచితమైనది. గొర్రెపై హాయిగా నిద్రపోతూ కనిపించగా ఇది సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ వేడుక జరుగగా విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక గత ఏడాది ఈ టైటిల్‌ను గొర్రెల జంట గెలుచుకున్నాయి.ఈ పోటీ జంతు ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.