Nalini Attempts Suicide: రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం, 29 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న నళిని

తమిళనాడులోని వేలూరు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె (nalini sriharan) ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. తోటి ఖైదీతో ఘర్షణ పడినట్లు వార్తలు వస్తున్నాయి.

Rajiv Gandhi killer Nalini attempts suicide in prison (Photo-PTI)

Chennai, July 21: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం (Rajiv Gandhi killer Nalini attempts suicide) చేశారు. తమిళనాడులోని వేలూరు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె (nalini sriharan) ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. తోటి ఖైదీతో ఘర్షణ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఫోన్ కాల్‌కి కలాం లొంగి ఉంటే నేడు భారత్ పరిస్థితి ఏమై ఉండేది? అణురంగంలో విప్లవాత్మక మార్పులు జరిగేవా? డూ ఆర్ డై వెనుక ‘మిస్సైల్ మ్యాన్’ పడిన కష్టంపై విశ్లేణాత్మక కథనం

1991లో మానవ బాంబు పేల్చి మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీని హతమార్చిన ఘటనలో (rajiv gandhi killer nalini sriharan) కోర్టు ఈమెను దోషిగా ప్రకటించింది. అప్పటి నుంచి నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్‌ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్‌ (Murugan) సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ

1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్‌ నారాయణన్‌ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

తనను శిక్ష నుంచి విముక్తి కల్పించాలని మాత్రం పలుమార్లు ప్రభుత్వాలకు, కోర్టులకు ఆమె అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఆమెకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మాత్రమే మార్చారు. కాగా రాజీవ్ హత్య కేసులోనే ఇదే వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె భర్త మురుగన్ తాజాగా నళిని ఆత్మహత్యాయత్నంపై (Nalini Attempts Suicide) ఆందోళన వ్యక్తం చేశారు. తోటి ఖైదీతో ఘర్షణ నేపథ్యంలో ఆమెను మరో జైలుకు మార్చాలని మురుగన్ కోరుతున్నారు. రాజీవ్ హత్య కేసులో నళిని, మురుగన్ తో పాటు మొత్తం ఏడుగురు వేలూలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ ఘటనపై నళిని వ్యక్తిగత లాయర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా నళిని ఎప్పుడూ ఇలాంటి ఘటనకు పాల్పడలేదన్నారు. అయితే జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మరో మహిళతో నళినికి మనస్పర్థలు వచ్చాయన్నారు. ఆ విషయంలో ఏమైనా మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారాయన.



సంబంధిత వార్తలు

CM Atishi Comments on Amith Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సీరియ‌స్ కామెంట్స్ చేసిన ఢిల్లీ సీఎం అతిషి, గ్యాంగ్ స్ట‌ర్ల‌కు అడ్డాగా మారింద‌ని ఆగ్ర‌హం

CM Revanth Reddy: వరంగల్‌ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్