RBI Repo Rate Unchanged: వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం, మరో 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసిన ఆర్భీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిపింది.ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నేడు వెల్లడించారు.ఈ సందర్భంగా వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
New Delhi, Dec 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిపింది.ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నేడు వెల్లడించారు.ఈ సందర్భంగా వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది. వరుసగా 11వ సారి కూడా రెపో రేటు (Repo Rate)ను 6.5 శాతంగానే ఫిక్స్ చేసింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్పణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా, 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఇలాగే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి.అక్టోబర్‌లో ఏకంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరిన సంగతి విదితమే.
యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
ఇదిలా ఉంటే రిజర్వు బ్యాంక్ క్రమంగా బంగారం నిల్వలను పెంచుకుంటున్నది. అక్టోబర్ నెలలో సెంట్రల్ బ్యాంకులు 60 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేయగా, దీంట్లో రిజర్వుబ్యాంక్ అత్యధికంగా 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తంగా 77 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా, దీంట్లో సెంట్రల్ బ్యాంక్ 27 టన్నులు కొనుగోలు చేసినట్లు ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా డబ్ల్యూజీసీ ఈ విషయాన్ని వెల్లడించింది.