Reynhard Sinaga: వాడు మగాడు కాదు కామాంధుడు, సాటి మగాడు కనిపిస్తే అస్సలు వదలడు, 190 మందిని రేప్ చేశాడని పోలీసుల అంచనా, జీవిత ఖైదు శిక్ష విధించిన యూకే కోర్ట్

అతడి మొదటి మరియు రెండవ పెరోల్ కు సంబంధించిన విషయం కోర్టులో విచారణ సాగుతుండగా జైల్లోనే మరో 23 మందిపై లైంగికదాడి జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.....

File image of Serial Rapist Reynhard Sinaga | Photo: Twitter

Manchester, January 6: ఈ సమాజంలో మహిళలకే కాదు పురుషుల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఏ వైపు నుంచి ఎవరు, ఎలా కాటేస్తారో తెలియని పరిస్థితి. అలా కనిపించిన మగాడినల్లా చెరబట్టిన ఓ కామాంధుడి (Homosexual)కి యూకే కోర్ట్ (UK Court) జీవితఖైదు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే, ఇండోనేసియాకు చెందిన రీనార్డ్ సినగా (Reynhard Sinaga) అనే 36 ఏళ్ల యువకుడు ఇంగ్లాండ్, మాంచెస్టర్ నగరంలోని ఓ యూనివర్శిటీలో విద్యనభ్యసిస్తున్నాడు . అయితే రీనార్డ్ కు మగాళ్లంటే పిచ్చి, బయట ఎక్కడైనా ఒంటరిగా మగాడు కనిపిస్తే అస్సలు ఊరుకునే వాడు కాదు.

క్లబ్ ల వద్ద, బార్ల వద్ద ఎవరైనా బాధతో లేదా ఒంటరిగా కనిపించే వాళ్లను సినగా టార్గెట్ చేసేవాడు. మంచివాడిగా (Good Samaritan) నటిస్తూ వారితో మాటలు కలిపి, నేనున్నానంటూ ధైర్యాన్ని చెబుతూ తన ఫ్లాట్ కు తీసుకెళ్లేవాడు. అక్కడ వారికి మత్తు మందు, డ్రగ్స్ ఇచ్చి వారు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాక, వారి శరీరాలతో విపరీతమైన సెక్స్ ధోరణులతో అత్యాచారాలు, లైంగిక దాడులకు (Sexual Harassment)  పాల్పడుతూ వచ్చేవాడు. అంతేకాకుండా కాకుండా తన వికృత చేష్టలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఒక వ్యక్తిని అయితే ఏకధాటిగా 8 గంటల పాటు అత్యాచారం చేసినట్లు అతడి వీడియోల ద్వారా తెలిసింది. ఇలా ఒకరిని కాదు, ఇద్దర్ని కాదు గత రెండున్నరేళ్ల కాలంలో సుమారు 195 మంది మగవారి జీవితాలను తన కామానికి బలిచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి సుమారు 3.29 టీబీ స్టోరేజ్ తన అత్యాచారాలకు సంబంధించిన డేటాను, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కామంతో కళ్లు మూసుకుపోతే ఎండిపోయిన కట్టె కూడా కత్రినా కైఫ్‌లా కనిపిస్తుందట, ముంబైలో మగాడిపై 5గురు సామూహిక అత్యాచారం

48 మంది మగాళ్లపై అత్యాచారం చేసిన కేసులో సినగాను యూకే కోర్టు దోషిగా నిర్ధారించింది. మిగతా మందిని పోలీసులు గుర్తించాల్సి ఉంది. చాలా మంది మగాళ్లు తమ పరువు పోతుందని బయటకు రావడం లేదు. యూకే చరిత్రలోనే రీనార్డ్ సినగా అత్యంత కరుడుగట్టిన రేపిస్ట్ (Most prolific rapist)అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి, అతడికి కనీసం 30 ఏళ్ల కారాగార శిక్షతో పాటు, జీవిత ఖైదు శిక్ష విధించారు.

సినగా ఇప్పటికే 2018 నుంచి 88 లైంగిక వేధింపుల కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మొదటి మరియు రెండవ పెరోల్ కు సంబంధించిన విషయం కోర్టులో విచారణ సాగుతుండగా జైల్లోనే మరో 23 మందిపై లైంగికదాడి జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు కొంతమంది బాధితుల వాంగ్మూలంపైనే కోర్ట్ అతడికి జీవితఖైదు విధించింది.