Robotic Nurses in TN: తమిళనాడులో కరోనా కల్లోలం, రోబోలే నర్సులు, కరోనా రోగులకు ఆహారం, మందులు ఇచ్చేందుకు రంగంలోకి దిగిన రోబోలు, 411కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

చెన్నైలోని స్టాన్‌లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి (Stanley hospital) ఓ విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వ సహాయంతో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా (Coronavirus) రోగులకు ఆహారం మరియు మందులు ఇచ్చేందుకు ఈ ఆస్పత్రిలో రోబో నర్సులను (Robot Nurse) రంగంలోకి దించింది.

Robots Deployed at Chennai's Hospital to Serve Food, Medicines to Coronavirus Patients (Photo-Twitter)

Chennai, April 4: తమిళనాడులో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తమిళనాడులో ఈ ఒక్కరోజులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో తూత్తుకుడి, తిరునెవేలి, శివగంగ, మధురై, కోయంబత్తూరు, తేని, దిండిగుల్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ 110 కేసులు ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో పళనిస్వామి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దీంతో కేసుల సంఖ్య 411కి చేరింది. ఈ నేపథ్యంలో సర్కారు మరింత అలర్ట్ అయింది.

ఈ దెబ్బతో కరోనావైరస్ చస్తుంది, తమిళనాడులో సరికొత్త ప్రయోగం

కరోనా రోగుల నుంచి ఆ వ్యాధి మరోకరికి సోకకుండా.. చెన్నైలోని స్టాన్‌లీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి (Stanley hospital) ఓ విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వ సహాయంతో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా (Coronavirus) రోగులకు ఆహారం మరియు మందులు ఇచ్చేందుకు ఈ ఆస్పత్రిలో రోబో నర్సులను (Robot Nurse) రంగంలోకి దించింది.

Here's Dr C Vijayabaskar Tweet

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయ్‌భాస్కర్ శుక్రవారం ఆ ఆస్పత్రిని సందర్శించి.. ఈ ‘రోబో సర్సు’లు ఎలా పని చేస్తున్నాయో పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రోబో ఒక జార్‌లో నీళ్లు, గ్లాసు, శానిటైజర్ బాటిల్ తదితర వస్తువులను రోగుల వద్దకు ఎలా తీసుకువెళ్తుందో గమనించారు.

దీని వల్ల కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్లు, నర్సులకు ఆ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అవుతాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో శుక్రవారం నాటికి కొత్తగా 102 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరిన విషయం తెలిసిందే.

తమిళనాడు నుంచి ఢిల్లీకి 1130 మంది వెళ్లగా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు 515 మందిని గుర్తించింది. మిగతా వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు నమోదైన 110 కొత్త కేసులతో కలిపి తమిళనాడులో మొత్తం 234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.