Sam Pitroda Resigns: భారతీయుల రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్‌కు శామ్‌ పిట్రోడా రాజీనామా, వెంటనే ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ

పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Sam Pitroda (Photo Credit: ANI)

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) చైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ (Jairam Ramesh) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.

భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది. రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మార్చి మీకు అత్యధిక ఓట్లు పడేలా చేస్తా, శివసేన నేతతో ఆర్మీ జవాన్ బేరసారాలు, గుట్టు రట్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు

వారసత్వ హక్కుపై ఇటీవల శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్లులా, పశ్చిమ భారతావని ప్రజలు అరబ్బులుగా, ఈస్ట్ ప్రజలు చైనీయుల్లా ఉండారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై ఇటు ప్రధానితో సహా బీజేపీనేతలు తప్పుపట్టగా, పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

New Model Kia Syros Car: మార్కెట్లోకి కియా మ‌రో కొత్త కారు, అదిరిపోయే ఫీచ‌ర్ల‌కు, ఆక‌ట్టుకునే ధ‌ర‌తో తీసుకొస్తున్న కియా

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif