SBI Controversial Circular: ఉమెన్స్ కమీషన్ మొట్టికాయలతో వెనక్కు తగ్గిన ఎస్‌బీఐ, వివాదాస్పద సర్కులర్ వెనక్కు తీసుకున్న అతిపెద్ బ్యాంకు

గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ (SBI circular)ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ క్యాండిడేట్స్‌ల విషయం ఎస్‌బీఐ (SBI) జారీ చేసిన సర్కులర్ వివాదాస్పదంగా మారింది.

State Bank of India (Photo Credits: PTI)

New Delhi January 29: ఉమెన్‌ కమిషన్‌ (Women commission) నోటీసుల దెబ్బకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State bank of India) దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ (SBI circular)ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ క్యాండిడేట్స్‌ల విషయం ఎస్‌బీఐ (SBI) జారీ చేసిన సర్కులర్ వివాదాస్పదంగా (controversial circular) మారింది. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా సర్క్యులర్‌ జారీ చేసింది. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్‌ 31న రిలీజ్‌ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.

అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitaraman)కు ఈ విషయమై లేఖ కూడా రాశారు.

ఈ నేపథ్యంలో ఎస్బీఐ(SBI) వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్‌ సర్క్యులర్‌ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్‌ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్‌ చైర్మన్‌ ఉమెన్‌ కమిషన్‌ ముందు ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.