SC on Tribunals Reforms Bill: చర్చలేకుండా ఎలా ఆమోందించారు, ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు ఆర్డినెన్స్ కొట్టివేసినా బిల్లులోకి ఎలా చేర్చారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టాలని ఆదేశం

దీనిపై జారీ అయిన ఆర్డినెన్స్‌ను కొట్టివేసినా.. వాటిని బిల్లులోకి ఎలా చేర్చారని (SC on Tribunals Reforms Bill) ప్రశ్నించింది. వివిధ ట్రైబ్యునళ్లలో ఖాళీలు పది రోజుల్లో భర్తీ చేయాలని (Fill Tribunal Vacancies in 10 Days) కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi August 17: ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లును పార్లమెంటులో చర్చ లేకుండానే ఆమోదించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై జారీ అయిన ఆర్డినెన్స్‌ను కొట్టివేసినా.. వాటిని బిల్లులోకి ఎలా చేర్చారని (SC on Tribunals Reforms Bill) ప్రశ్నించింది. వివిధ ట్రైబ్యునళ్లలో ఖాళీలు పది రోజుల్లో భర్తీ చేయాలని (Fill Tribunal Vacancies in 10 Days) కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నియామకాల్లో జాప్యం కారణంగా ట్రైబ్యునళ్లు నిర్వీర్యం అయ్యే దశకు చేరుకుంటున్నాయని పేర్కొంది. ఖాళీల భర్తీపై అలసత్వం చేస్తున్నారంటూ కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.

జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను (Tribunals Reforms Bill) ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల సర్వీసు, పదవీకాలానికి సంబంధించిన నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసినా ఈ నిబంధనలను బిల్లులో మళ్లీ పొం దుపరచడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టివేసినప్పటికీ బిల్లును పార్లమెంటులో ఆమోదించారు. చర్చ జరగలేదు. పార్లమెంటు వివేకాన్ని మేం ప్రశ్నించడం లేదు. దాని అధికారాల గురించి కూడా మేమేమీ మాట్లాడడం లేదు. బిల్లును ప్రవేశపెట్టడానికి సహేతుక కారణాలేంటో మాకు తెలియాలి’ అని జస్టిస్‌ రమణ అన్నారు. కీలక ట్రైబ్యునళ్లలో 240కిపైగా ఉన్న ఖాళీల్లో ఒక్క నియామకం కూడా చేపట్టలేదని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించారు. వాటిని కొనసాగించాలనుకుంటున్నారా.. మూసివేయాలనుకుంటున్నారా’ అని ఆయన ప్రశ్నించారు.

దేశంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న టీకా డ్రైవ్‌, తాజాగా 154 రోజుల తర్వాత అత్యంత తక్కువగా 25,166 కేసులు నమోదు, గత 24గంటల్లో 88.13లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ

బిల్లుపై చర్చ ఏం జరిగిందో మాకు చూపించండి. ఇది చాలా తీవ్రమైన అంశం. చర్చ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నంత మాత్రాన బిల్లులో నియమాలను కోర్టు కొట్టివేయలేదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.. ఎందుకు ఈ బిల్లు రూపొందిస్తున్నాం... ట్రైబ్యునళ్లను కొనసాగించాలా.. మూసివేయాలా ? ఇదే ప్రధానమైన ప్రశ్న’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లు, 2021పైనా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు కొట్టివేసిన ప్రొవిజన్లను తిరిగి పొందుపరుస్తూ ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది.

ఖాళీలు భర్తీ చేయకపోతే ట్రైబ్యునళ్లు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సదరు మంత్రిత్వశాఖ నోట్‌ సిద్ధం చేసే ఉంటుంది కదా అది మాకు చూపించగలరా అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతాను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. బిల్లు పూర్తిగా చట్టరూపం దాల్చకముందే తాను స్పందించలేనని, బిల్లు చెల్లుబాటు ప్రశ్నార్థకం కానందున ప్రస్తుతం తాను స్పందించలేనని తుషార్‌ మెహతా తెలిపారు.

ట్రైబ్యునల్‌ కేసుల్లో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ హాజరు అవుతారని, ఏజీతో మాట్లాడి స్టేట్‌మెంట్‌ రూపొందించడానికి సమయం కావాలని తుషార్‌మెహతా కోరారు. ఖాళీ భర్తీపై స్టేట్‌మెంట్‌ రూపకల్పనకు పది రోజులు సమయం ఇవ్వాలని తుషార్‌మెహతా కోరగా.. గత విచారణ సమయంలో ఖాళీల జాబితా ఇచ్చారని, వారిని నియమించాలని భావిస్తే అడ్డుకోబోమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. కోర్టు చెప్పిన విషయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, పదిరోజుల్లో పురోగతి ఉంటుందని, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌లో నియామకాలు జరుగుతున్నాయని, మిగతా వాటిల్లో నియామక ప్రక్రియ (అండర్‌ ప్రాసెస్‌) మొదలైందని తుషార్‌ తెలిపారు. అండర్‌ ప్రాసెస్‌ అంటే దీర్ఘకాల ప్రక్రియగా సీజేఐ అభివర్ణించారు. ఎప్పుడు నియామకాలు గురించి అడిగినా అండర్‌ ప్రాసెస్‌ అంటున్నారని, దీని వల్ల అర్థం లేదని, పదిరోజుల్లో నియామకాలు పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నామని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొంటూ విచారణ పది రోజులకు వాయిదా వేశారు.

అనుమానాలు, ఊహాగానాలు, మీడియాలో వచ్చిన నిరాధారమైన కథనాల ఆధారంగానే పెగాసస్‌ గూఢచర్యం ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ పలువరు పిటిషన్లు దాఖలు చేశారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేసిన తప్పుడు కథనాలను అడ్డుకునేందుకు, లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పెగాసస్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇప్పటికే స్పష్టం చేశారని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తెలిపింది. పిటిషనర్ల ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. పెగాసస్‌ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేయడంతో ఎలాంటి చర్చ లేకుండా ఈ నెల 2న లోక్‌సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ నెల 9న రాజ్యసభలోనూ చర్చ లేకుండానే ఆమోదించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif