Tirupati–Sainagar Shirdi Express: ఏపీలో తప్పిన పెను ప్రమాదం, పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు
తిరుపతి-షిర్డీ(Tirupati to Shirdi) మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ (Shirdi Express)కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్(Koduru railway station) సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్ వెనక ఉన్న జనరల్ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం(All passengers are safe) జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Amaravathi, December 3: ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి-షిర్డీ(Tirupati to Shirdi) మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ (Shirdi Express)కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్(Koduru railway station) సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్ వెనక ఉన్న జనరల్ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం(All passengers are safe) జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. రేణిగుంట జంక్షన్ నుంచి సిబ్బందిని రప్పించారు. దీంతో అటువైపుగా వెళ్లాల్సిన రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పట్టాలు స్వల్పంగా ధ్వంసం కావడం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలను సరి చేసిన అనంతరం... రైళ్ల రాకపోకలను క్రమబద్దీకరిస్తామని అధికారులు తెలిపారు.
ANI Tweet
నంబర్ 17417 ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం 8:35 నిమిషాలకు తిరుపతి నుంచి షిర్డీకి బయలుదేరింది. సరిగ్గా గంట సేపటి తరువాత కడప జిల్లాలోని రైల్వే కోడూరు వద్ద పట్టాలు తప్పింది. రైల్వే కోడూరు స్టేషన్ లోకి ప్రవేశించడానికి లోకో పైలెట్ బ్రేక్ ను వేసిన వెంటనే పట్టాలు తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే కోడూరు పట్టణంలోకి ప్రవేశించిన తరువాత రైలు కొద్దిసేపు నెమ్మదిగా ప్రయాణించిందని, కాస్సేపటికే పెద్ద శబ్దంతో పట్టాలు తప్పిందని వెల్లడిస్తున్నారు.
15 రోజుల క్రితం తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి ఏర్పేడు రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలో పట్టాలు తప్పింది. ప్యాంట్రి కార్ భోగి చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.కేరళ ఎక్స్ ప్రెస్ లోకో పైలైట్ చాకిచక్యంగా ట్రైన్ నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందన్నారు.