PM Modi Security Breach: ప్ర‌ధాని మోదీ కారుపై చెప్పు విసిరిన ఆగంత‌కులు, వార‌ణాసి ప‌ర్య‌ట‌న‌లో మోదీకి చేదు అనుభ‌వం, అంత సెక్యూరిటీ ఉన్నా..చెప్పు ఎలా వచ్చింద‌ని విచార‌ణ‌

ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ (Modi in Varanasi) వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు (Slipper Thrown) విసిరారు.

PM Modi Security Breach (PIC@ X)

Varanasi, June 19: ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ (Modi in Varanasi) వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్‌పైకి చెప్పులు (Slipper Thrown) విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

అయితే, ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినప్పటికీ (Slipper Thrown on Modi Car) ఈ ఘటన చోటు చేసుకుంది.

 

మంగళవారం రోజున ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గంగా హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో పంజాబ్‌లో కూడా ఇలాగే ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యం ఎదురైంది. కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై కాన్వాయ్ నిలిచిపోయింది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి