COVID19 in India: భారత్‌లో 26 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,490 కేసులు నమోదు, 49 వేలు దాటిన కరోనా మరణాలు
నిన్న ఒక్కరోజే 944 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 49,980 కు పెరిగింది....
New Delhi, August 16: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 63,489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 25,89,682కు చేరింది. నిన్న ఒక్కరోజే 944 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 49,980 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 53,322 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 18,62,258 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 6,77,444 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
దేశంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి, 50వేలకు పైగా కేసులు గల రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
అయితే దేశంలో ఉండే ఆక్టివ్ కరోనా కేసుల కంటే, ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కొంత ఊరటనిచ్చే విషయంగా చెప్పవచ్చు.
అయితే దేశంలో ఉండే ఆక్టివ్ కరోనా కేసుల కంటే, ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కొంత ఊరటనిచ్చే విషయంగా చెప్పవచ్చు.
మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, దిల్లీ లాంటి రాష్ట్రాలలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాలలో కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తే భారతదేశ కొవిడ్ కేసుల సంఖ్య 90 శాతం తగ్గించినట్లే అవుతుంది.
ఒక్క మహారాష్ట్రలోనే ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారణ కాబడిన కేసులు 6 లక్షలకు చేరువ కాగా, తమిళనాడులో 3.3 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లో 2.8 లక్షలతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా గల కొవిడ్ కేసుల సంఖ్య 21.3మిలియన్లు దాటగా, మరణాలు 769,652 కు పెరిగాయని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక పేర్కొంది.