Subhash Chandra Bose Hologram Statue: నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ, న్యూఢిల్లీ ఇండియా గేటు వద్ద అద్భుతం..
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ జరగనుంది. 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.
న్యూఢిల్లీ, జనవరి 23: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ జరగనుంది. 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. దీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చూపించినందుకుగానూ కొన్ని సంస్థలకు, వ్యక్తులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబందన్ పురస్కార్ అవార్డును అందజేస్తారు. ప్రధాని మోదీ శుక్రవారమే ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ గ్రానైట్ స్టోన్ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని మాటిచ్చారు. అదే ప్రదేశంలో హాలోగ్రామ్ తో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రానైట్ విగ్రహం రెడీ అయ్యేంతవరకూ ఇదే విగ్రహం ఉంటుందని.. గ్రానైట్ రాయితో 25అడుగుల విగ్రహం తయారుచేయిస్తామని న్యూ ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ అద్వైత్ గడ్నైక్ వెల్లడించారు.
గతంలో జార్జ్ వీ విగ్రహం ఉన్న చోట సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని గొడుగు కింద ఏర్పాటు చేయనున్నారు. జార్జ్ వీ విగ్రహాన్ని 1968లోన తొలగించడంతో అప్పట్నుంచి ఆ ప్రదేశం ఖాళీగానే ఉంది. డిజిటల్ టెక్నాలజీతో ప్రొజెక్టర్ సాయంతో 3డీ షేప్ లో జనవరి 23న విగ్రహావిష్కరణ జరుగుతుంది. నిజమైన విగ్రహంలా కనిపించినప్పటికీ కేవలం 3G డిజిటల్ ఇమేజ్ మాత్రమే. ఈ టెక్నాలజీ సాయంతో టూరిస్టులు, సందర్శకులు నేతాజీ విగ్రహం నిజంగానే ఉందనే ఫీల్ అవుతారు.