Hyd, Jan 26: అంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేయడం అంటే యావత్ తెలంగాణను నిర్బంధించడం అన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan). బీఆర్‌ఎస్వీ(BRSV) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నిరసన తెలిపామన్నారు శ్రావణ్.
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన 125 అడుగుల Dr. B R అంబేద్కర్ ప్రాంగణానికి తాళాలు వేసి నిర్బంధం చేయడం రేవంత్ రెడ్డి.. ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్‌ను నిర్బంధించడం అంటే కేవలం ఒక విగ్రహానికే కాదు, యావత్ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను నిర్బంధించడమేనని ఆయన పేర్కొన్నారు.
సూర్య చంద్రులున్నంత కాలం అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎవరూ నిరోధించలేరు కానీ సీఎం రేవంత్ రెడ్డి, సైకో లా ప్రవర్తించి, అంబేద్కర్ విగ్రహా ప్రాంగణాన్ని కట్టడి చేయడం దారుణం అని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు(Dasoju Sravan Slams Revanth Reddy). ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఈ చర్యలు తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం మాజీ సీఎం కేసీఆర్(KCR) ఏర్పాటు చేసిన విగ్రహం అన్న కోపంతో అంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేసినట్లయితే, అదే కేసీఆర్ నిర్మించిన తెలంగాణ సచివాలయంలో ఎలా కూర్చుంటున్నారు?” అంటూ దాసోజు శ్రవణ్ గారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంట్లను తక్కువ చేసి, కుల రాజకీయం నడిపిస్తున్న సీఎం తక్షణమే తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, ఫ్యాక్షన్ మనస్తత్వంతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని, భారతదేశానికి చెందిన మహనీయుడైన అంబేద్కర్ గారిని అవమానించడం సరికాదని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి తండ్రిది కాదు లేదా తాతది కాదు, ఆ విగ్రహం డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారిది. ఆయన భారత దేశానికి చెందిన అమూల్యమైన వ్యక్తి అని మర్చిపోవద్దు అని రేవంత్ రెడ్డికి డాక్టర్ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.