Kejriwal Gets Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు, ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో కేజ్రీవాల్..కండీషన్స్ ఇవే
ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో బెయిల్ లభించింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్.
Delhi, Sep 13: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో బెయిల్ లభించింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్.
10 లక్షల పూచీకత్తు, ఇద్దరు సెక్యూరిటీ సంతకం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు తెలిపింది న్యాయస్థానం. అరెస్ట్ అక్రమం కాదని.. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలి..సాక్ష్యాలను టాంపర్ చేయకూడదు అని తెలిపింది.
జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్.అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి
Here's Tweet:
సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని తెలిపారు.