Supreme Court: అత్యాచార బాలిక గర్భ విచ్ఛిత్తి తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు, బాధితురాలి ప్రయోజనాలే ముఖ్యమని తెలిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం
తాజాగా ఈ తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది.
SC Recalls Order Allowing Pregnancy Termination: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల అనుమతించిన విషయం విదితమే. తాజాగా ఈ తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాలతో తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో మాధ్యమం ద్వారా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాలిక ప్రయోజనాలే పరమావధిగా పేర్కొన్న సీజేఐ.. ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక గర్భం రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి
సాధారణంగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం.. వివాహిత మహిళలు, ప్రత్యేక అవసరాలున్నవారు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంది. ఆ సమయం దాటితే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.