Ekta Kapoor: యువతను చెడగొడుతున్నావ్! ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, XXX వెబ్‌ సిరీస్‌పై కేసులో ఏక్తాకు ఎదురదెబ్బ, ప్రతిసారి కోర్టును ఆశ్రయించడం సరికాదు, కోర్టు ఉన్నది నోరులేని వారికోసం, ఏక్తాకపూర్‌పై అరెస్ట్ వారెంట్, కేసును సమర్ధించిన అత్యున్నత న్యాయస్థానం

ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ దేశ యువతరం మనసులను మీరు కలుషితం చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Credit@ Ekta Kapoor Twitter

New Delhi, OCT 15: తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ సుప్రీం (Suprem Court) తలుపు తట్టిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌కు (Ekta Kapoor )చుక్కెదురైంది. అంతే కాకుండా.. ఆమెపై వేసిన కేసును సమర్ధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX (ట్రిపుల్ ఎక్స్)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, అది ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తోందని సుప్రీం ధర్మాసనం మండిపడడం గమనార్హం. ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీలో XXX వెబ్ సిరీస్ (WEB Series) ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‭లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2 లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Student Molested: రోడ్డుపై వెళ్తున్న స్కూల్ విద్యార్ధినిని ఆటోలోకి లాగి అఘాయిత్యం, ఎందుకు కామెంట్ చేశావని అడిగినందుకు మృగంలా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌, సీసీటీవీలో రికార్డయిన అకృత్యం 

ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్‌నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై (OTT) ప్రసారమవుతున్న కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ దేశ యువతరం మనసులను మీరు కలుషితం చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Tamil Nadu Shocker: విరాట్ కోహ్లీని తిట్టినందుకు స్నేహితుడ్నే పొడిచి చంపిన వ్యక్తి, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్పోడంటూ వాదన, ఫుల్లుగా తాగి క్రికెట్‌ పై డిస్కషన్ పెట్టిన స్నేహితులు, మాట మాట పెరగడంతో బాటిల్‌తో పొడిచి హత్య 

జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ ‘‘మీరు ప్రతిసారీ ఈ కోర్టుకు వచ్చేస్తున్నారు. దీనిని సమర్థించలేం. ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నందుకు జరిమానా విధిస్తాం. రోహత్గీ గారూ, మీ క్లయింటుకు ఈ విషయాన్ని చెప్పండి. మంచి న్యాయవాదుల సేవలను పొందగలుగుతున్నారనే కారణంతో, నోరున్నవారి కోసం ఈ కోర్టు లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నోరు లేనివారి కోసం ఈ కోర్టు పని చేస్తోంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్నవారే న్యాయం పొందలేకపోతే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఆర్డర్‌ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి’’ అని ధర్మాసనం తెలిపింది.