Virat Kohli and Rohit Sharma (Photo Credits: Getty Images)

Chennai, OCT 14: రోహిత్ శర్మ గొప్పా? లేక విరాట్ కోహ్లీ గొప్పా అని ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చిన డిస్కషన్ చివరకు ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది. తమిళనాడులోని అరియలూరు జిల్లా మల్లూరులో (Mallur) ఈ ఘటన జరిగింది. కీలాపాలూర్ కు చెందిన విగ్నేష్‌ అనే యువకుడు ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సింగపూర్ వెళ్లేందుకు వీసా కోసం ట్రై చేస్తున్నాడు. అతనికి కొంచెం నత్తి ఉంది. ఈ క్రమంలో ఊర్లోనే ఉంటూ అల్లరిగా తిరుగుతున్నాడు. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. పైగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అంటే చాలా అభిమానం. ఐపీఎల్ సీజన్ వచ్చిదంటే చాలు ఆర్సీబీ గెలవాలంటూ పూజలు చేస్తాడు. అయితే మంగళవారం రాత్రి స్థానికంగా తన స్నేహితుడు ధర్మరాజ్ అనే వ్యక్తి వచ్చిందంటే చాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ గెలవాలంటూ పిచ్చి అభిమానంతో ఊగిపోయే విగ్నేష్ అనే వ్యక్తి....తన స్నేహితుడ్ని హత్య చేశాడు.

Gang Rape: రాత్రి బైక్ పై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళ.. వాహనాన్ని వెంబడించిన దుండగులు.. నిర్మానుష్య ప్రదేశం రాగానే ఆమె బైక్ ను బలంగా ఢీకొట్టిన కామంధులు.. మహిళ కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. ఒంగోలులో దారుణం 

మంగళవారం రాత్రి విగ్నేష్, ధర్మరాజ్ ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గొప్ప అంటూ ధర్మరాజ్ తొలుత డిస్కషన్ మొదలు పెట్టాడు. అయితే విరాట్ కోహ్లీ గొప్ప అంటూ విగ్నేష్ (Vignesh) కూడా వాదించాడు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా నీలాగే నత్తిది, ఎందుకూ పనికి రాదంటూ హేళన చేశాడు ధర్మరాజ్.

Honour Killing: ‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’, ‘డబ్బులు లేవండి’, ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’, యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య.. అనంతరం మృతదేహం నాలాలోకి.. హైదరాబాద్ లో గగుర్పొడుస్తున్న పరువు హత్య..  

దాంతో కోపంతో ఊగిపోయిన విగ్నేష్ అతన్ని బాటిల్‌ తో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఉదయం ధర్మరాజ్ శవాన్ని గుర్తించిన పోలీసులు...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విగ్నేష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.