SC's Vital Verdicts Today: ఈ రోజు మరో రెండు చారిత్రాత్మక తీర్పులు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ వస్తుందా..రాదా అనే దానిపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు, కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత కేసుపై కూడా కీలక తీర్పు

ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.

Supreme Court to pronounce its verdict on bringing CJI office under RTI Act (Photo Credits: ANI)

New Delhi, November 13: అయోధ్య భూవివాదం కేసులో గత శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)బుధవారం మరో రెండు కీలక అంశంలో తీర్పునివ్వడానికి సిద్ధమైంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? (CJI office under RTI Act)అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (chief justice of India) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.

దీంతో పాటుగా కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేల కేసు విచారణ (Disqualification of Rebel K'taka MLAs)చేసిన సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది.

సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం పొందుపరిచింది. సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ (challenging the Delhi High Court decision) చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. పారదర్శకతలేని వ్యవస్థను ఎవరూ కోరుకోరు. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థ నాశనమవ్వకూడదు అని విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ( CJI Ranjan Gogoi)అన్నారు.

2010లో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టుతో పాటు సీజేఏ ఆఫీసులు కూడా ప్రభుత్వ సంస్థలేనని.. అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అప్పీల్‌కు వెళ్లారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా..? లేదంటే తప్పుబడుతుందా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే అయోధ్య తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లు సహా పలు కీలక కేసుల్లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17న రంజన్ గొగొయ్ పదవీకాలం ముగియనుంది.