Swati Maliwal 'Assault' Case: స్వాతిమలివాల్‌పై దాడి కేసు, కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌కు 4 రోజుల రిమాండ్, ఎంపీ పదవికి రాజీనామా చేయనని తెలిపిన ఆప్ ఎంపీ
దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన బిభవ్‌కుమార్‌కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. స్వాతి మలివాల్‌పై దాడి కేసు, ఘటనలో రెండు వెర్షన్‌లు ఉన్నాయంటూ తొలిసారిగా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
తాజాగా ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ (Swati Maliwal) తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు. అలా కాకుండా దాడి చేయడంతో.. ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. 2006లో వీరితో కలిసి పనిచేసేందుకు వీలుగా నా ఉద్యోగాన్ని వదులుకున్నాను. అప్పుడు మా సంస్థలో ముగ్గురే ఉండేవారు. వారిలో నేను ఒకరిని.
ఆప్‌ను స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించాను. ఎవరికైనా నా రాజ్యసభ సీటు కావాలంటే నన్ను అడగాలి. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాను. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఆప్‌లో చేరినప్పటి నుంచి ఎటువంటి పదవీ కోరలేదు. కానీ, వారు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయను’’అని మాలీవాల్ అన్నారు.