Swiggy & Zomato Orders: ఒక్క రోజే 5 లక్షల బిర్యానీ ఆర్డర్లు, న్యూ ఇయర్ వేడుకల్లో రికార్డు స్థాయి డెలివరీలతో మోత మోగించిన స్విగ్గీ, జొమాటో
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలు కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేసేందుకు నాన్‌స్టాప్‌గా సేవలందించాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో స్విగ్గీ, జొమాటో (Swiggy and Zomato) సంచలనం సృష్టించాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలు కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేసేందుకు నాన్‌స్టాప్‌గా సేవలందించాయి. న్యూ ఇయర్ పార్టీల్లో కస్టమర్లు తమకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేయగా ఏకంగా 5 లక్షలకు పైగా ఆర్డర్లను (5 lakh plus orders) డెలివరీ చేశామని జొమాటో, స్విగ్గీ వెల్లడించాయి. 2022 చివరి రోజున తమ డెలివరీ టీం 3.5 లక్షల బిర్యానీ, 2.5 లక్షల పిజ్జాలను (biryani and pizza top the list) దేశవ్యాప్తంగా డెలివరీ చేసిందని స్విగ్గీ వెల్లడించింది.బిర్యానీ, పిజ్జాలు టాప్ ప్లేసులో నిలిచాయి.
డిసెంబర్ 31న 15 టన్నుల విలువైన 16,514 బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేశామని జొమాటో పేర్కొంది.తమకు సహకరించిన డెలివరీ పార్టనర్‌లకు ధన్యవాదాలని జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు.కాగా రెస్టారెంట్ల నుంచి ఫుడ్ మాత్రమే కాకుండా చిప్స్ సహా పార్టీ కోసం పలు పదార్ధాలను ప్రజలు ఆర్డర్ చేశారు. పెద్దసంఖ్యలో చిప్స్, లెమన్స్, సోడాలను డెలివరీ చేశామని స్విగ్గీ వెల్లడించింది. 56,437 చిప్స్ ఆర్డర్లు మరికొన్ని నిమిషాల్లో డెలివరీ కాబోతున్నాయని జొమాటో టేకోవర్ చేసిన బ్లింకిట్ సీఈఓ అల్విందర్ ధిండ్సా వెల్లడించారు. బెంగళూర్‌కు చెందిన ఓ బ్లింకిట్ యూజర్ అత్యధికంగా రూ .29,000 గ్రాసరీస్ ఆర్డర్ చేశాడని తెలిపారు.