New Delhi, JAN 01: కొత్త ఏడాది 2023కు (New year) ఔత్సాహిక యువత ఘనస్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకాయి. మద్యం మత్తులో లెక్కలేనంతమంది నూతన ఏడాదిలోకి అడుగుపెట్టారు. అందుకే ఎప్పటిలాగే న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్‌తో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. న్యూఇయర్ వేడుకల్లో ఈసారి ఒక్క మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. అందులో కండోమ్స్ (Condom Orders) ఒకటి. నిన్న ఒక్కరోజే స్విగ్గీ 2757 డ్యూరెక్స్ కండోమ్ (Durex Condom) ప్యాకెట్లు డెలివరీ చేసిందంట. ఈ మేరకు ఒక సరదా ట్వీట్ చేసింది డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ. ఇప్పటి వరకు 2757 కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ చేశారు. మరో 4212 ప్యాకెట్లు కూడా ఆర్డర్ చేయండి, అప్పుడు మొత్తం 6969 అవుతాయంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. అయితే దీనికి నెటిజన్ల నుంచి మరింత వెరైటీగా రీ ట్వీట్లు, రిప్లైలు వస్తున్నాయి.
2757 packets of @DurexIndia condoms delivered by @SwiggyInstamart so far. please order 4212 more to make it 6969, so we can all say "nice"
— Swiggy (@Swiggy) December 31, 2022
Thank you for ‘delivering’ them O’s. We know atleast 2757 are having a banging new year ;)
P.s: We hope they order coffee together tomorrow morning
— Durex India (@DurexIndia) December 31, 2022
Nice
— Shashank Mishra (@mishrashashan14) January 1, 2023
ఇక న్యూఇయర్ ఆర్డర్లలో బిర్యానీకి కూడా భారీ గిరాకీ లభించింది. పెద్ద సంఖ్యలో బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. డిసెంబర్ 31 శనివారం రాత్రి 10:25 గంటల వరకు ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్వీ (Swiggy) ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసింది. దేశవ్యాప్తంగా స్విగ్వీ యాప్‌పై ఈ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. దేశవ్యాప్తంగా వచ్చిన బిర్యానీ ఆర్డర్లలో 75.4 శాతం ఆర్డర్లు ఒక్క హైదరాబాద్ బిర్యానీ కోసమేనని ‘ట్విటర్‌పై నిర్వహించిన పోల్’లో (Poll) తేలిందని స్విగ్గీ పేర్కొంది. ఆ తర్వాత లక్నోవి బిర్యానీ కోసం 14.2 శాతం, కోల్‌కతా బిర్యానీల కోసం 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. 3.50 లక్షల బిర్యానీలతో డిసెంబర్ 31న ఎక్కువగా డెలివరీ చేసిన ఆహారంగా బిర్యానీ నిలిచిందని, రాత్రి 7:20 గంటలకే 1.65 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసినట్టు వివరించింది. హైదరాబాద్‌లో బిర్యానీ విక్రయాల్లో టాప్‌లో నిలిచిన రెస్టారెంట్లలో బావర్చి ఒకటని, ప్రతి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ చేసినట్టు పేర్కొంది. ఇక ఒక్క స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌పైనే ఇన్ని బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయంటే ఇతర ప్లాట్‌ఫామ్స్ అన్నింటిపైనా ఆర్డర్లు ఏ రేంజ్‌లో వచ్చాయో అర్థంచేసుకోవచ్చు.
Twitter: భారత్ లో 48,624 సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేసిన ట్విట్టర్, ఇకపై మరింత స్ట్రిక్ట్..
దేశవ్యాప్తంగా బిర్యానీ తర్వాత పిజ్జాను(Pizza) అత్యధికంగా డెలివరీ చేసినట్టు వివరించింది. డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా 61 వేల పిజ్జాలు డెలివరీ చేసినట్టు స్విగ్గీ కంపెనీ పేర్కొంది. మరోవైపు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్స్‌కు ఆర్డర్స్ వచ్చాయని తెలిపింది. అంతేకాదు ఇదే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై 2757 ప్యాకెట్ల డ్యురెక్స్ కండోమ్స్ డెలివరీ చేశామని వెల్లడించించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 12,344 మంది కస్టమర్లు న్యూఇయర్ వేడుకలకు కిచిడీ ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది.