Chennai Shocker: వీడు తండ్రేనా.. తనకు హెచ్‌ఐవి ఉందని తెలిసి సవతి కూతురిపై నెలల తరబడి అత్యాచారం, బాలిక వార్డెన్‌కు చెప్ప‌డంతో దారుణ ఘటన వెలుగులోకి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తనకు హెచ్‌ఐవి ఉందని తెలిసి కూడా ఓ కామాంధపు తండ్రి మైనర్ బాలిక అయిన సవతి కూతురిపై అత్యాచారానికి (Chennai Man held for raping teen stepdaughter) తెగబడ్డాడు. కామంతో వావివ‌ర‌స‌లు మ‌రిచిన‌ వ్య‌క్తి (Chennai Shocker) స‌వ‌తి కూతురిపై నెల‌ల త‌ర‌బడి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని షోల‌వరం ప్రాంతంలో వెలుగుచూసింది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Chennai, Sep 19: చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు హెచ్‌ఐవి ఉందని తెలిసి కూడా ఓ కామాంధపు తండ్రి మైనర్ బాలిక అయిన సవతి కూతురిపై అత్యాచారానికి (Chennai Man held for raping teen stepdaughter) తెగబడ్డాడు. కామంతో వావివ‌ర‌స‌లు మ‌రిచిన‌ వ్య‌క్తి (Chennai Shocker) స‌వ‌తి కూతురిపై నెల‌ల త‌ర‌బడి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని షోల‌వరం ప్రాంతంలో వెలుగుచూసింది. బాధిత బాలిక ఈ దారుణాన్ని వార్డెన్‌కు వివరించ‌డంతో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..బాధితురాలు 8వత‌ర‌గ‌తి చ‌దువుతూ హాస్ట‌ల్‌లో ఉంటోంది. క‌రోనా మ‌హ‌మ్మారితో బాలిక ఇంటికి చేరుకుని త‌ల్లి, స‌వ‌తి తండ్రితో క‌లిసి ఉంటోంది. నిందితుడు, బాధితురాలి త‌ల్లి హెచ్ఐవీ పాజిటివ్ రోగులుగా నిర్ధార‌ణ అయింది. భ‌ర్త చనిపోవ‌డంతో బాధితురాలి త‌ల్లి నిందితుడిని వివాహం చేసుకుని అత‌డితో క‌లిసి ఉంటోంది. ఇక బాలిక త‌ల్లి ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో నిందితుడు స‌వ‌తి కూతురిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.

భార్య కరోనాతో మృతి, ఆమె చెల్లెలితో పెళ్లి చేయలేదని 4 గురు కూతుర్లను చంపిన కసాయి తండ్రి, తరువాత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం

నెల‌ల త‌ర‌బ‌డి సాగుతున్న ఈ వ్య‌వ‌హారం బాలిక వార్డెన్‌కు చెప్ప‌డంతో దారుణం బ‌య‌ట‌ప‌డింది. స్కూల్ అధికారులు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక‌ను కౌన్సెలింగ్ నిమిత్తం షెల్ట‌ర్ హోంకు త‌ర‌లించి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.