Tamil Nadu Shocker: ప్రభుత్వ టీచర్ కాదు కామాంధుడు, నాలుగేళ్ల చిన్నారిపై అదే పనిగా లైంగిక దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తమిళనాడులో దారుణ ఘటన

తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ (Govt teacher arrested) చేశారు.

Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Chennai, August 30: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ (Govt teacher arrested) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది.

ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి ( sexual abuse of four-year-old student) గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో ప్రతిరోజూ ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు

విచారణలో పాఠశాల కరస్పాండెంట్‌ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్‌ కామరాజ్‌ తరచూ విద్యార్థినిపై ( four-year-old student) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్‌ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్‌ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు.

కుద్రపూజల కోసం కుటుంబం మొత్తాన్ని కత్తితో నరికి చంపిన పూజారి, హత్య అనంతరం మృదేహాల వద్ద క్షుద్రపూజలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆ సమయంలో కామరాజ్‌ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్‌ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ మురగేష్‌ పాఠశాల టీచర్‌ కామరాజ్‌ను సస్పెండ్‌ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement