Tamil Nadu Horror: ఇష్టంలేని పెళ్లి...కొత్తగా పెళ్లైన కూతురిని అల్లుడిని దారుణం చంపేసిన తండ్రి, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

తన మాట వినకుండా పెళ్లి చేసుకుందని తండ్రి కూతురుని అల్లుడిని (Man Kills Newly-Wed Daughter, Husband) చంపేశాడు. తూత్తుకుడి (Thoothukudi) జిల్లాలోని ఓడరేవు పట్టణం టుటికోరిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది

Murder (Photo Credits: Pixabay)

Chennai, July 26: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాట వినకుండా పెళ్లి చేసుకుందని తండ్రి కూతురుని అల్లుడిని (Man Kills Newly-Wed Daughter, Husband) చంపేశాడు. తూత్తుకుడి (Thoothukudi) జిల్లాలోని ఓడరేవు పట్టణం టుటికోరిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. తమిళనాడుకి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె తనకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని తీవ్ర అసంతృప్తకి లోనయ్యాడు. వాస్తవానికి ఆ వ్యక్తి తన కుమార్తె కనబడటం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ తదనంతరం అతడి కుమార్తె తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల సమక్షంలో తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య, 10 రోజుల వ్యవధిలోనే రెండో ఘటన, తమ కూతురు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ తల్లిదండ్రులు ఆందోళన

ఆఖరికి గ్రామ పెద్దల సమక్షంలో కూడా అతడి కుమార్తె తన కుటుంబ సభ్యులను తమ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని, ఇబ్బంది పెట్టవ‍ద్దని కోరింది. అయితే ఆ సమయంలో తండ్రి నుంచి తమకు ప్రాణ హానీ ఉందని పోలీసులకు తెలియపర్చలేదు.

తాగుబోతు కొడుకుని చంపి శవాన్నిముక్కలుగా నరికేసిన తండ్రి, పాలిథిన్‌ బ్యాగుల్లో ఆ ముక్కలను వివిధ ప్రాంతాల్లో పడేశాడు, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

Father తీవ్ర అసహనంతో అవమానంతో రగిలిపోతూ... కోపావేశాలకు గురై కన్న కూతురుని (Man Kills Newly-Wed Daughter) అల్లుడిని అత్యంత పాశవికంగా హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ జంట అద్దె ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కాగా అల్లుడు చదువు మానేసి జులాయి తిరగుతూ తమ కూతుర్ని చేసుకోవడం కూతురు తల్లిదండ్రులకు నచ్చలేదని తెలుస్తోంది.