Hyderabad: సరూర్ నగర్‌లో కాల్పుల కలకలం, అరుస్తుందని పక్కింటి కుక్కను గన్‌తో కాల్చి చంపిన బ్యాంక్ మేనేజర్, యజమాని ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు, బేగంపేట హెచ్‌ఢీఎఫ్‌సీలో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడు అవినాష్
పదేపదే ఇంట్లోకి వస్తుందన్న కోపంతో ఎయిర్ గన్‌తో (air-gun)ఓ బ్యాంక్ మేనేజర్ కుక్కను కాల్చి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బేగంపేట బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి మేనేజర్ (HDFC Manager)అవినాష్ బాపూనగర్‌లో ఉంటున్నాడు.
Saroornagar, December 23: తెలంగాణాలోని(Telangana) సరూర్ నగర్‌లో (Saroornagar) ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. పదేపదే ఇంట్లోకి వస్తుందన్న కోపంతో ఎయిర్ గన్‌తో (air-gun)ఓ బ్యాంక్ మేనేజర్ కుక్కను కాల్చి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బేగంపేట బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి మేనేజర్ (HDFC Manager)అవినాష్ బాపూనగర్‌లో ఉంటున్నాడు.
కుక్క ప్రతీసారి ఇంట్లోకి వస్తుందడడంతో అవినాష్‌కు కోపం వచ్చింది. వెంటనే కుక్కు ఇంట్లోకి రాగానే ఎయిర్ గన్‌తో దాన్ని కాల్చాడు. కుక్క ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కుక్క యజమాని రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు (Saroornagar police)కేసు నమోదు చేసుకొని అవినాష్‌ను అరెస్టు చేశారు. గత సంవత్సరం బషీర్‌బాగ్‌లో అవినాష్ 18 వేల రూపాయలకు ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు.
Saroornagar police station Circle Inspector Srinivas Reddy
అవినాష్ బేగంపేట్ HDFCలో మేనేజర్ గా పని చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.అవినాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూగజీవాన్ని చంపినందుకు ఎనిమల్ యాక్ట్ క్రింద చర్య తీసుకోబోతున్నామని పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బాపూనగర్ కాలనీలో ఆదివారం (డిసెంబర్ 22) మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.