IPL Auction 2025 Live

5G Services In India: దేశంలో అందుబాటులోకి 5జీ సర్వీసులు, అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, 20 రెట్లు అధిక వేగం సొంతం, ముందుగా మెట్రో నగరాల్లో మాత్రమే 5జీ సర్వీసులు, వీలైనంత తొందరగా విస్తరించనున్న టెలికాం కంపెనీలు

36.4 లక్షల కోట్లు ($455 బిలియన్లు)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Credit @ DoT India Twitter

New Delhi, OCT 01: దేశంలో 5జీ సేవలను (5G Services) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 (India Mobile congress) కార్యక్రమంతో పాటూ 5జీ సర్వీసులను కూడా ప్రధాని ప్రారంభించారు. అయితే తొలుత దేశంలో ఎంపిక నగరాల్లో ఈ 5జీ సేవలు (5G Services) అందబాటులోకి వస్తాయి. వచ్చే కొన్నేళ్లలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోకి రానున్నాయి. తక్కువ వ్యవధిలోనే దేశంలో 5జీ టెలికాం సేవలను 80శాతం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన.. దేశంలోనే అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. ఇందులో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన జియో (JIO) 87,946.93 కోట్ల రూపాయల బిడ్‌తో విక్రయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగభాగాన్ని కొనుగోలు చేసింది.

భారతదేశపు అత్యంత సంపన్న సంస్థ అయిన గౌతమ్ అదానీ గ్రూప్ (Adani Group) 400 MHz కోసం 211.86 కోట్ల రూపాయల బిడ్ వేసింది. అయితే, ఇది పబ్లిక్ టెలిఫోన్ సేవలకు ఉపయోగించలేదు. అదే సమయంలో, టెలికాం దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్ భారతీ ఎయిర్‌టెల్ (Bharthi Airtel) రూ. 43,039.63 కోట్ల బిడ్‌ను దాఖలు చేయగా, వొడాఫోన్-ఐడియా రూ. 18,786.25 కోట్లకు దాఖలు చేసింది. 5జీ టెక్నాలజీ భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

First 5G-ready Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 5జీ నెట్‌వర్క్ రెడీ, ప్రస్తుతమున్న వైఫై కంటే 20రెట్లు వేగంగా సేవలు, ఫస్ట్ 5జీ ఎయిర్ పోర్టుగా రికార్డులకెక్కిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్, మోదీ ప్రారంభించగానే ఇక్కడే తొలిసారి 5జీ సర్వీసులు షురూ 

భారత్ పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2023 – 2040 మధ్యకాలంలో రూ. 36.4 లక్షల కోట్లు ($455 బిలియన్లు)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని నిపుణులు చెబుతున్నారు.