Bengaluru Shocker: శృంగారానికి ఒప్పుకోలేదని కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి చంపిన భర్త, మిస్టరీ కేసులో వీడిన చిక్కుముడి..
భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు ఆమె మృతదేహాన్ని షిరాడీ ఘాట్‌లో పడేశాడు.
షాకింగ్ సంఘటనలో, బీహార్‌కు చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య సెక్ష్ కు వద్దు అన్నందుకు హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు ఆమె మృతదేహాన్ని షిరాడీ ఘాట్‌లో పడేశాడు. తర్వాత అతడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులకు అనుమానం రావడంతో కాస్త గట్టిగా విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, నిందితుడిని మడివాలా నివాసి పృథ్వీ రాజ్ సింగ్‌గా గుర్తించారు. నేరంలో సింగ్ భాగస్వామి సమీర్ కుమార్ ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సింగ్ తన భార్య జ్యోతి కుమారితో గొడవపడ్డాడు. పెళ్లి సమయంలో తన భార్య వయస్సు గురించి అబద్ధం చెప్పిందని అలాగే తనతో సెక్స్ చేయడానికి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన పృథ్వీరాజ్ సింగ్ హత్యకు పాల్పడ్డాడు.
సింగ్ రెండేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చి మారుతీ నగర్‌లో పృథ్వీరాజ్ నివాసముంటున్నాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. తొమ్మిది నెలల క్రితం పృథ్వీరాజ్ సింగ్ జ్యోతిని వివాహం చేసుకున్నాడని అధికారి తెలిపారు. "పెళ్లి సమయంలో, ఆమె తన వయస్సు 28 సంవత్సరాలు అని మా కుటుంబ సభ్యులకు తెలియజేసింది, ఆమె నా కంటే 10 సంవత్సరాలు పెద్దదని తర్వాత మాకు తెలిసిందని ఆరోపించాడు. ఆమె తనతో సెక్స్‌కు అంగీకరించలేదని సింగ్ పోలీసులకు చెప్పాడు.
తన భార్య నుండి అవమానాన్ని ఎదుర్కొన్న తరువాత, సింగ్ ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సీతామర్హి నివాసి తన స్నేహితుడు సమీర్ కుమార్ సహాయం కోరాడు. సింగ్ అభ్యర్థన మేరకు, సమీర్ తన స్నేహితుడి భార్యను చంపడంలో సహాయం చేయడానికి జూలై చివరి వారంలో నగరానికి వచ్చాడు. వీరిద్దరూ స్నేహితుడి క్యాబ్‌ని అద్దెకు తీసుకుని ఆగస్ట్ 3న జ్యోతితో కలిసి ఉడిపికి వెళ్లారు. ఉడిపి నుంచి తిరిగి వస్తుండగా వీరిద్దరూ జ్యోతిని గొంతుకోసి హత్య చేశారు. షిరాడీ ఘాట్‌లో మృతదేహాన్ని పడవేశారు.
మరుసటి రోజు పృథ్వీరాజ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ వెళ్లాడు. అయితే జ్యోతి కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. మృతురాలి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.