Astrology Tips: ఈ మూడు రాశుల వారిపై మాత్రమే బృహస్పతి అనుగ్రహం, మిగతా రాశుల వారు పరిహారం చేయాలి, ఏయే రాశులపై గురుడి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం

గురువారం శ్రీమహావిష్ణువును, సాయిబాబాను పూజించటం అనేది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అదేవిధంగా ఈ రోజు దేవగురు బృహస్పతికి (గురుడు) (Jupiter) కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు

planet astrology

హిందూ ఆచారాల ప్రకారం, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం శ్రీమహావిష్ణువును, సాయిబాబాను పూజించటం అనేది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అదేవిధంగా ఈ రోజు దేవగురు బృహస్పతికి (గురుడు) (Jupiter) కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు. ఏ వ్యక్తి యొక్క జాతకంలో బృహస్పతి (Brihaspati) బలహీనంగా ఉన్నాడో.. అతను ఈ రోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా అతడి కెరీర్ లో పురోగతి ఉండదని శాస్త్రాలు (Astrology Tips) చెబుతున్నాయి. వారి వ్యాపారంలో నష్టాలు వస్తాయి. బృహస్పతి బలహీనంగా ఉన్నవారు గురువారం ఈ పరిహారాలు చేయడం ద్వారా జాతకంలో బృహస్పతి యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ రోజు మూడు రాశుల వారికి గురుడు అనుగ్రహం ఉంటుంది. మిగతావారికి అంత అనుకూలంగా ఉండదు.

మీనరాశిలో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల వృషభ రాశి వారికి మంచి రోజులు వస్తాయి. గురువు అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇక బృహస్పతి తిరోగమనం మిథునరాశి వారికి విశేష ప్రయోజనాలను ఇస్తుంది. అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మిగతా రాశాలు వారు ఏం చేయాలో పండితులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

ఈ రోజు రాశి ఫలాలు, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిలో ఏముందో చెక్ చేసుకోండి

బృహస్పతి బలహీనంగా ఉన్నవారు గురువారం రోజున ముందుగా నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మీరు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. అలాగే అరటి చెట్టు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది కాబట్టి అరటి చెట్టు దగ్గర కూర్చుని పూజించండి. అరటిచెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఇక విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుచేత స్నానం చేసి పూజలో కూర్చున్నప్పుడు పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. దేవుడికి పసుపు రంగు పువ్వులు సమర్పించండి. ఈ రోజున 'ఓం బృహస్పత్యే నమః' అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల వ్యక్తి యొక్క జాతక దోషాలు తొలగిపోయి, జీవితంలో డబ్బును బాగా సంపాదిస్తారు. కెరీర్ ఉన్నతంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.

(Note: ఈ కథనం ఇంటర్నెట్లో పండితులు సూచించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.ఈ సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. లేటెస్ట్ లీ మీడియా దీనిని ధృవీకరించలేదు. దీనికి ఎటువంటి బాధ్యత వహించదు)