TikTok, BGMI Coming Back: త్వరలోనే టిక్‌టాక్ ప్రారంభమయ్యే ఛాన్స్, టిక్‌టాక్ అభిమానులకు గుడ్ న్యూస్, ప్రభుత్వంపై టిక్‌టాక్ యాజమాన్యం చర్చలు, బ్యాటిల్ గ్రౌండ్స్ కూడా తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు
అప్పటినుంచి దేశంలో టిక్ టాక్, పబ్ జీ పూర్తిగా బ్యాన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు యాప్స్ తిరిగి భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
New Delhi, AUG 07: రెండేళ్ల క్రితం భారత్‌లో షార్ట్ వీడియో యాప్ (TikTok)కు ఫుల్ క్రేజ్ ఉండేది. దేశంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్, పబ్‌జీ (బాటిల్ గ్రౌండ్స్ మొబైల్) యాప్‌లతో టక్కరి చైనా దొంగబుద్ధి చూపించడంతో ఆయా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. అప్పటినుంచి దేశంలో టిక్ టాక్, పబ్ జీ పూర్తిగా బ్యాన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు యాప్స్ తిరిగి భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, అందిన కొన్ని నివేదికలను పరిశీలిస్తే.. షార్ట్-వీడియో యాప్ TikTok భారత్ కు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే.. టిక్‌టాక్ యాజమాన్యంలోని కంపెనీ బైట్‌డాన్స్ (ByteDance)భారత్‌లో టిక్‌టాక్ సర్వీసులను పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. అందులో భాగంగానే ముంబైకి చెందిన కంపెనీతో కొన్ని నెలలుగా చర్చలు జరుపుతోంది. ఇప్పుడు భారత్‌లోని ప్రముఖ ఎస్పోర్ట్స్ గేమింగ్ వెంచర్ CEO, Skyesports షార్ట్-వీడియో యాప్ నిజంగానే భారత్‌కు తిరిగి వస్తోందని ధృవీకరించింది. భారత్‌లో అతిపెద్ద వినియోగదారు యాప్‌లో ఒకటిగా నిలిచిన టిక్‌టాక్‌ను 2020లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టిక్‌టాక్‌తో పాటు, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా 58 ఇతర యాప్‌లు కూడా ఇండియాలో బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం టిక్‌టాక్(TikTok) యాప్ త్వరలో భారత్‌కు తిరిగి వస్తుందని Skysports CEO శివ నంది (Shiva Nandy) తెలిపారు. అందిన డేటా ప్రకారం.. Tik Tok తిరిగి రావడానికి రెడీగా ఉంది. అలాంటప్పుడు, BGMI (Battle Grounds Mobile India) భారతీయ పబ్‌జీ వెర్షన్ (PUBG India Version) 100 శాతం తిరిగి వస్తుందని అంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే.. త్వరలోనే భారత్‌కు వస్తుందని ఆశిస్తున్నానని శివ నంది తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ప్రకటనలో తెలిపారు.
BGMI నిషేధంపై నంది మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ బ్యాన్ అనేది అకస్మాత్తుగా నిర్ణయించలేదన్నారు. దాదాపు 5 నెలలుగా నిషేధంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. “ఇది తక్షణ చర్య కాదు. దాదాపు ఐదు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. వాస్తవానికి.. ప్లే స్టోర్ (Play Store) నుంచి గేమ్‌ను డిలీట్ చేయడానికి వారం ముందు, ప్రభుత్వం క్రాఫ్టన్ హెచ్‌క్యూ (Krafton HQ)కి మధ్యంతర నోటీసు పంపింది. ఈ గేమ్‌ను స్టోర్ నుంచి తొలగించడానికి రెండు రోజుల ముందు తమకు సూచన వచ్చిందన్నారు. అందుకే చాలా అడ్వాన్స్ మొత్తాన్ని Skysports లీగ్, LAN ఢిల్లీకి చెల్లించాలని సీఈఓ నంది BGMI నిషేధంపై వివరణ ఇచ్చాడు. BGMI కూడా త్వరలో తిరిగి వస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది యాప్‌పై నిషేధం కాదని, మధ్యంతర ఉత్తర్వులుగా ఆయన పేర్కొన్నారు.
BGMI భారత్‌కు తిరిగి వస్తున్న వార్తలను ఇప్పటివరకు (Krafton HQ) లేదా భారత ప్రభుత్వం ధృవీకరించలేదు. భారత్‌లో వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రీస్టోర్ చేసేందుకు హీరానందానీ గ్రూప్‌తో Bytedance చర్చలు జరుపుతోందని జూన్‌లో నివేదిక పేర్కొంది. ముంబయి, బెంగుళూరు, చెన్నై అంతటా ప్రాజెక్ట్‌లతో భారత్‌లోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో హిరందందానీ గ్రూప్ (Hirandandani) ఒకటిగా ఉంది. అయితే రియల్ ఎస్టేట్ దిగ్గజం యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ (Yotta Infrastructure Solutions) కింద డేటా సెంటర్ కార్యకలాపాలను కూడా రన్ చేస్తోంది. ఇటీవల టెక్నాలజీ-లీడ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఆర్మ్-తేజ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించింది. నివేదికల ప్రకారం.. రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రస్తుతం అన్వేషణ దశలో ఉన్నాయని తెలిపింది. వాస్తవానికి తమతో దీనిపై అధికారిక చర్చలు లేవని, ఆమోదం కోసం వచ్చినప్పుడు మాత్రమే వారి అభ్యర్థనను పరిశీలిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.