5G Rollout: జియో నుంచి అదిరిపోయే న్యూస్, అక్టోబర్ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందామని తెలిపిన రిల్
Reliance Jio (Photo Credits: Twitter)

దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది.ఏడురోజుల పాటు జరిగిన ఈ బిడ్డింగ్‌లో మొత్తం రూ.1,50,173కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆగస్ట్‌ 10 కల్లా 5జీ స్పెక్ట్రం కేటాయింపులు (5G Rollout) జరుపుతామని మంత్రి తెలిపారు.ఈ నేపథ్యంలో 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానుండగా..తొలిసారి జియో 5జీ నెట్‌ వర్క్‌ సేవల్ని యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.

స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టాప్ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.ఈ ఏడాది అక్టోబర్‌లో 5జీ నెట్‌ వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు మూడు టెక్ సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు సంస్థలు 5జీ నెట్‌ వర్క్‌ నిర్మాణ పనుల్ని పూర్తి చేశాయని టెస్ట్‌లతో పాటు ట్రయల్స్‌ నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

చైనాకు దిమ్మ తిరిగే షాకిచ్చిన జియో, ఎయిర్టెల్‌, చైనా కంపెనీలతో 5జీ సేవల ఒప్పందం క్యాన్సిల్, ఎరిక్సన్, శాంసంగ్‌లతో ఒప్పందం, కొనసాగుతున్న 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలం

ఈ నేపథ్యంలో జియో (Reliance Jio) దేశంలో తన 5జీ సేవల్ని వినియోగదారులకు అందించనుంది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, జామ్‌నగర్‌ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ పనితీరుపై ట్రయల్స్‌ నిర్వహించినట్లు సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ తెలిపారు.రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాష్‌ ఎం అంబానీ మాట్లాడుతూ పాన్‌ ఇండియా అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తాం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందాం' అని అన్నారు.