Tiger of Mysore: మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు?, తెల్లవారిని హడలెత్తించిన టిప్పు సుల్తాన్ జయంతి నేడు, ఆ దేశభక్తుడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..

ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary)ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.

Tipu Sultan Birth Anniversary Some Facts about the Tiger of Mysore (Photo-File Image)

Mumbai, November 20: భారతదేశంలో రాచరికపు పాలనకు చరమగీతం పాడినవారిలో టిప్పు సుల్తాన్ (Tipu Sultan) ఒకరు. ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary) ఆయన జయంతి సందర్భంగా ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.

మైసూర్ పులి (Tiger of Mysore)గా ప్రసిద్ధి కెక్కిన టిప్పు సుల్తాన్ కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లిలో నవంబర్ 20, 1950న జన్మించారు. ఇది బెంగుళూరుకు 45 మైళ్ల దూరంలో ఉంది. టిప్పు

సుల్తాన్ పూర్తి పేరు Sultan Fateh Ali Khan Shahab. ఇతని తండ్రి పేరు హైదర్ ఆలీ (Hyder Ali) తల్లి Fatima Fakhr Un Nisa.. ఆయన కూడా మహా వీరుడు. ఆయన అప్పటి మైసూరు సుల్తాన్‌. కాగా ఇప్పటి గ్రేటర్‌ కర్ణాటకనే అప్పటిలో మైసూర్‌ స్టేట్‌ అనేవారు. మైసూర్‌ రాజధానిగా శ్రీరంగపట్నం ఉండేది. మైసూర్‌ సంస్థానాన్ని టిప్పు సుల్తాన్‌ 1783 నుంచి 1799 వరకు పరిపాలించాడు.

రాచరికపు పాలనలో నలిగిపోతున్న రోజులవి. బ్రిటిష్‌ వారు భారతదేశంలో ఏవో కొన్ని భాగాలను కాక, మొత్తం దేశాన్నే క్రమంగా ఆక్రమించాలని యత్నిస్తున్నట్టు టిప్పు సుల్తాన్ గ్రహించాడు. ఓ సారి వారితో పోరాడి ఓడిపోయాడు. ఆ యుద్ధంలో ఓటమి అనంతరం బ్రిటీష్ వారికి కప్పం కింద భారీగా డబ్బు, అలాగే తన ఇద్దరు కుమారులను హామీ కింద వారికి సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారికి దాసోహమనకుండా తన సంస్థానాన్నితిరిగి చేజిక్కించుకునేందుకు మరో యుద్ధానికి సిద్ధమయ్యాడు.

అయితే అటు నిజాం కానీ, ఇటు మహారాష్ట్రులు కాని చివరికి భారతదేశంలోని ఇతర ముస్లిం రాజ్యాలూ టిప్పు సుల్తా‌తో కలిసి రాలేదు. వారంతా బ్రీటీష్ వారికి భయపడి వారి పాదాల కింద ఉండిపోయారు. దీంతో బ్రిటిషర్లతో ఆయన ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ బ్రిటిష్‌ వారితో ఒంటరి పోరాటం చేయడం కష్టమని భావించిన టిప్పు తక్కిన భారతీయ సంస్థానాలను, వాటి పరిపాలకులను పదే పదే తనతో కలిసి విదేశీయులతో పోరాడాలని, లేకపోతే యావద్దేశం అచిరకాలంలోనే వారికి పాదాక్రాంతం కావడం తథ్యమని హెచ్చరిస్తూ వచ్చాడు.

అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ఇతర దేశాలైన ఫ్రాన్సు, అప్ఘానిస్తాన్‌, అరేబియా, మారిషస్‌, సిరియా, ఈజిప్ట్‌, జోర్డాన్‌, లిబియా, సూడాన్‌, అల్జీరియా, టునీషియా మొదలైన దేశాలకు రాయబారులను పంపి యుద్ధంలో సహాయం చేయమని కోరారు. ఎవ్వరూ అతనికి సాయంగా రాలేకపోయారు. దీనికి ప్రధాన కారణం బ్రిటీష్ వారికి ఎదురుతిరిగితే భూమి మీద నూకలు ఉండవని భయపడటమే..

అయినా, టిప్పు సుల్తాన్‌ నైరాశ్యం చెందలేదు. ఒంటరి పోరాటం కొనసాగిస్తూనే వచ్చాడు. మొత్తంగా బ్రిటిష్‌ వారితో ఆయన నాలుగు యుద్ధాలు చేశాడు. మధ్యలో రెండింటిలో టిప్పు సుల్తాన్‌ గెలిచే సరికి బ్రిటిష్‌ వారికి భయం పట్టుకుంది. ఆయనను తుదముట్టిస్తేనే ఇండియాలో మన ఆటలు సాగుతాయని గ్రహించారు.

ఇందుకోసం నాలుగు వైపుల నుంచి దాడికి వ్యూహ రచన చేశారు. ఉత్తరం నుంచి నిజాం సైన్యాలు; దక్షిణం నుంచి మహారాష్ట్ర సేనలు; తూర్పు, పశ్చిమ దిశల నుంచి బ్రిటిష్‌ పదాతి దళాలు, అశ్విక దళాలు శ్రీరంగపట్నాన్ని ముట్టడించాయి.

స్వదేశ సంస్థానాలే విదేశీయులతో చేతులు కలిపాయి. అయినా, టిప్పు వెనుకంజవేయలేదు. చివరకు నాల్గవ ఆంగ్లో – మైసూర్‌ యుద్ధంలో – 1799 మే నెలలో ఆ దేశభక్తుడు బ్రిటిష్‌ సేనలతో పోరాడుతూనే వీరమరణం పొందారు.

ఓటమి చెందగానే బ్రిటీష్ వారికి తలొగ్గి రాజ్యాన్ని కాపాడుకునే వారు ఉన్న ఆ కాలంలో మైసూరు పులి గెలుపు వచ్చేదాకా తిరగబడ్డారు. బ్రిటీష్ వారి వద్ద హామీగా ఉన్న ఇద్దరు కుమారులను ఆ ముష్కరులు చంపేసినా అదరలేదు, బెదరలేదు. కడవరకు టిప్పు సుల్తాన్‌ వారికి ‘జో హుకుం’ అనలేదు. దటీజ్ టిప్పు సుల్తాన్.

మొన్న రాష్ట్రపతి కోవింద్‌ అన్నట్టు, రాకెట్‌ ప్రయోగ పరిజ్ఞానాన్ని తన ఆఖరి దశలో కనుగొన్న ఆధునిక యుద్ధతంత్ర నిపుణుడు ( the pioneer of Rocket Technology in India) టిప్పు సుల్తాన్‌. మనదేశం నుంచి ఆ తరువాత రాకెట్‌ ప్రయోగ నైపుణ్యాన్ని పాశ్చాత్య దేశాలు తెలుసుకున్నాయని, దానికే ‘మైసూర్‌ రాకెట్‌’ అన్న పేరు కూడా వచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif