Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ వార్!
ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.
Hyd, Sep 21: గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తలపడ్డ ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణుగా మారిపోయింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు పవన్. తిరుపతి లడ్డూ ఘటనపై విచారణ జరపాలి.. దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు ప్రకాశ్. అలాగే ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయడం మంచిది కాదని , మన దేశంలో ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని.... కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్
Here's Tweet:
దీనికి కౌంటర్ ఇచ్చారు మా అధ్యక్షులు మంచు విష్ణు. దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించవద్దని ప్రకాశ్ రాజ్‌కు హితవు పలికారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు... లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి అని చురకలు అంటించారు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.