Two-Finger Test Banned: అత్యాచార బాధితురాలిపై టూ ఫింగర్ టెస్ట్‌పై మండిపడిన సుప్రీంకోర్టు, తక్షణమే ఈ విధానం నిలిపివేసేలా చూడాలని కేంద్రానికి ఆదేశాలు
బాధితురాళ్లపై అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్ టెస్ట్’ (Two-Finger Test Banned) విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది.
New Delhi, Oct 31: బాధితురాళ్లపై అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్ టెస్ట్’ (Two-Finger Test Banned) విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ విధానానికి (Ensure Vaginal Laxity Tests) ఎలాంటి శాస్త్రీయత లేదని, పైగా మహిళలను మళ్లీ గాయపర్చడంతో పాటు.. వాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇక నుంచి బాధితురాలి మీద ‘టూ ఫింగర్ టెస్ట్’ గనుక నిర్వహిస్తే.. దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, అలాంటి పరీక్షలను నిర్వహించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల పాఠ్యాంశాలను సమీక్షించాలని, స్టడీ మెటీరియల్స్ నుంచి ‘టూ ఫింగర్ టెస్ట్’ విధానాన్ని తొలగించాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉంటే 2013లోనూ సుప్రీం కోర్టు టూ ఫింగర్ టెస్ట్‌ను తప్పుబట్టింది. ఇది మహిళల గౌరవం, గోప్యతలను దెబ్బ తీస్తుందని పేర్కొంది.