Union Budget 2023: బడ్జెట్‌లో ఏపీకి రూ.8,406 కోట్లు, తెలంగాణకు రూ.4,418 కోట్లు, రైల్వే విభాగంలో ఈ నిధులు కేటాయించినట్లు తెలిపిన మంత్రి అశ్విని వైష్ణవ్
బడ్జెట్ 2023లో (Union Budget 2023)రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) కలిపి రూ.12,824 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
New Delhi, Feb 3: బడ్జెట్ 2023లో (Union Budget 2023)రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) కలిపి రూ.12,824 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల (railway sector) కోసం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఈ సందర్భంగా ఆయన (Railway Minister Ashwini Vaishnav) గుర్తు చేశారు. బడ్జెట్‌లో తెలంంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. వీటిలో డబ్లింగ్, ట్రిపులింగ్ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో రోజు వారీ సరుకులు కూడా ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలుకు మంచి స్పందన వస్తోందని, త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయని వెల్లడించారు.ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నామన్నారు.కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫీజుబులిటి పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామన్నారు.