Amul Hikes Milk Price: మళ్లీ పాల ధరను మూడు రూపాయలు పెంచిన అమూల్, పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి, కొత్తగా పెంచిన ధరలతో పాల ధరలు ఇవే..
Amul Hikes Milk Prices (Photo Credit: PTI)

దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’మళ్లీ రేట్లు పెంచేసింది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 గా ఉండనున్నాయి.

సామాన్యుడిపై మరో భారం, పాల ధరను రెండు రూపాయిలు పెంచిన అమూల్,ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచినట్లు వెల్లడి

ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరల జాబితాను గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే విడుదల చేశారు. కాగా, గతంలో అమూల్ 2022లో పాల ధరను మూడుసార్లు పెంచిన విషయం తెలిసిందే.

సామాన్యుడికి మరో షాక్‌, భారీగా పెరిగిన అమూల్‌ పాల ధర, లీటరకు రెండు రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన

గతేడాది మార్చి, ఆగస్టు, అక్టోబర్‌లలో పాలధరను పెంచింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. గతంలో సాధారణంగా లీటరుకు రూ.2 పెంచగా.. ఈసారి ఏకంగా మూడు రూపాయలు పెంచేసింది.