Amul Raises Milk Prices: సామాన్యుడిపై మరో భారం, పాల ధరను రెండు రూపాయిలు పెంచిన అమూల్,ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచినట్లు వెల్లడి
Amul Hikes Milk Prices (Photo Credit: PTI)

అముల్ డెయిరీ సంస్థ లీట‌రు పాల‌పై రెండు రూపాయ‌లు పెంచింది. రేపటి నుంచి కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి. ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచిన‌ట్లు అముల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అహ్మ‌దాబాద్‌, సౌరాష్ట్ర మార్కెట్‌లో అర లీట‌రు అముల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు. అర లీట‌రు అముల్ తాజా రూ.25కు, అముల్ శ‌క్తి లీట‌రు పాల‌ను రూ.28కి అమ్ముతున్నారు. లీట‌రుపై రెండు రూపాయ‌లు పెంచ‌డం అంటే, ఎంఆర్పీపై రూ.4 పెరిగిన‌ట్లు అని ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. పాల ధ‌ర‌ను పెంచ‌డం వ‌ల్ల పాల ఉత్ప‌త్తిదారుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఆ సంస్థ తెలిపింది.

మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్‌క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది.