పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. లీటర్ పాలపై రూ. 2 పెంచుతున్నట్టు ఆ సంస్ధ యాజమాన్యం తెలిపింది. పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ(మంగళవారం) నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, అమూల్ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా.. అమూల్ సంస్థ చివరి సారిగా గతేడాది జూలైలో పాల ధరలను పెంచింది.
కొత్త ధరల ప్రకారం..
1. 500 Ml అమూల్ గోల్డ్ పాలు రూ. 30 (పాత రేటు రూ. 28)
2. 500 Ml అమూల్ తాజా వేరియంట్ రూ. 24.
3. 500 Ml అమూల్ శక్తి రూ. 27లకు పాలు లభించనున్నాయి.
AMUL increases the price of milk by Rs 2. The prices will come into effect from tomorrow (March 1, 2022) pic.twitter.com/R2IeDQFtOo
— ANI (@ANI) February 28, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)