Unlock 3.0 or Lockdown Again?: అన్‌లాక్‌ 3.0 లేక లాక్‌డౌన్ కంటిన్యూ? వచ్చేవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో విశ్వరూపం దాల్చిన కరోనా

ఈ సమావేశంలో దేశంలో కరోనావైరస్ తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్‌ నియంత్రణ చర్యలు, అలాగే అన్‌లాక్‌ 3.0పై (Unlock 3.0) చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత (COVID-19 pandemic), లాక్‌డౌన్ (Lockdwon) మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video Conference) నిర్వహించారు.

PM Narendra Modi in West Bengal (Photo Credits: ANI)

New Delhi, Jul 25: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ( PM Modi to Meet CMs) కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో దేశంలో కరోనావైరస్ తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్‌ నియంత్రణ చర్యలు, అలాగే అన్‌లాక్‌ 3.0పై (Unlock 3.0) చర్చించనున్నట్లు సమాచారం.

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత (COVID-19 pandemic), లాక్‌డౌన్ (Lockdwon) మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video Conference) నిర్వహించారు. దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదా? మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్న పలు రాష్ట్రాలు, కొవిడ్‌-19 కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్

న్యూస్ 18 మరియు టైమ్స్ నౌ నివేదికల ప్రకారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా  ఈ సమావేశంలో పాల్గొంటారు అని తెలుస్తోంది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సిఎంలతో మొత్తం ఆరు సమావేశాలు నిర్వహించారు.

మునుపటి సమావేశాలు COVID-19 తో పోరాడటానికి దేశం యొక్క వ్యూహాన్ని చర్చించటానికి మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్లకు దారితీశాయి. చివరి సమావేశం గణనీయమైన సడలింపుల కోసం జరిగింది. సిఎంలందరూ మొదటి సమావేశానికి హాజరుకాగా, కేరళ సిఎం పినరయి విజయన్ గత రెండు సమావేశాలకు ఒక ప్రతినిధిని పంపారు. చాలా మంది సిఎంలు తమ గ్రీవెన్స్‌ను ప్రసారం చేశారు . లాక్‌డౌన్ విస్తరించాలన్న కేంద్రం చర్యకు మద్దతు ఇచ్చారు.

కాగా చివరిగా జూన్ 16,17 తేదీల్లో... వరుసగా రెండు సార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్ సడలించిన తర్వాతి పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించిన విషయం తెలిసిందే.

శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. అంతేకాకుండా దేశంలో త్వరలోనే రోజు లక్ష కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27 న జరగబోయే వీడియో కాన్ఫెరెన్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. దేశంలో ఐసీయూ పడలకు, వెంటిలేటర్ల కొరత తీవ్రగా ఉన్న నేపథ్యంలో... ఈ అంశాలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.