UP: వీడియో ఇదిగో, వేగంగా వెళుతున్న రైలులో ఎమర్జెన్సీ కిటికీ నుంచి కిందపడిన చిన్నారి, అర్థరాత్రి 16 కిలోమీటర్ల మేర కాలినడక గాలించి బాలికను రక్షించిన పోలీసులు

ఈ ఘటనపై రైల్వే పోలీసులు వేగంగా స్పందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడగలిగారు.

UP Police Heroic rescue of 8-year-old who fell from moving train (Photo-UP Ploice)

యూపీలో కుటుంబంతో రైల్లో ప్రయాణిస్తున్న ఓ 8 ఏళ్ల చిన్నారి తెరిచి ఉన్న ఎమర్జెన్సీ కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వేగంగా స్పందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడగలిగారు. రాత్రివేళ 16 కిలోమీటర్ల మేర కాలినడక గాలించి బాలికను పోలీసులు రక్షించారు. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు ఓ కుటుంబం వెళ్తుండగా ఘటన జరిగింది.

కుటుంబంతో కలిసి చిన్నారి రైలులో ప్రయాణిస్తూ బోగీలోని ఎమర్జెన్సీ కిటికీ వద్ద కూర్చుంది. మార్గమధ్యంలో ఆ బాలిక ఉన్నట్టుండి కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. గమనించిన చిన్నారి తండ్రి వెంటనే లలిత్‌పుర్‌ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు.అప్రమత్తమైన ఝాన్సీ జీఆర్పీ పోలీసులు.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌తో కలిసి గాలింపు చేపట్టారు.

వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఓ యువకుడిని దారుణంగా కొట్టిన యువకులు, సిద్దిపేటలో దారుణ ఘటన

నాలుగు బృందాలుగా విడిపోయి రాత్రివేళ చిమ్మచీకట్లోనే 16 కిలోమీటర్ల మేర కాలినడకన గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పట్టాల పక్కన ఉన్న ఓ చెట్ల పొదల్లో గాయాలతో స్పృహకోల్పోయిన స్థితిలో బాలికను గుర్తించారు. అయితే రోడ్డు మార్గం లేకపోవడంతో అటుగా వెళ్తున్న గూడ్స్‌ రైలును ఆపి వెంటనే లలిత్‌పుర్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.

UP Police Heroic rescue Video

 

View this post on Instagram

 

A post shared by UP POLICE (@uppolice)

తన కుమార్తెను కాపాడిన రైల్వే పోలీసులకు ఆ పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను యూపీ పోలీసులు (UP Police) సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చిన్నారి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసులు, అధికారులను నెటిజన్లు అభినందిస్తున్నారు.