Uttar Pradesh Horror: ఓ వైపు రక్తం కారుతూ, మరో వైపు నొప్పితో ఏడుస్తున్నా వదలని కామాంధులు, మైనర్ బాలికను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి బట్టలు లేకుండా ఇంటికి పంపించిన కిరాతకులు
ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మొరాదాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను బట్టలు విప్పి ( Minor girl stripped), సామూహిక అత్యాచారం (gang-raped) చేసి, బలవంతంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చేశారు.
Lucknow, Sep 21: ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మొరాదాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను బట్టలు విప్పి ( Minor girl stripped), సామూహిక అత్యాచారం (gang-raped) చేసి, బలవంతంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చేశారు. మైనర్ పక్క గ్రామంలో జరిగే జాతరకు హాజరయ్యేందుకు సెప్టెంబరు 1న వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని నివేదికలు తెలిపాయి.బాలిక రక్తస్రావంతో ఏడుస్తున్నా కామాంధులు కనికరించలేదు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు తెగబడ్డారు.
పొరుగు గ్రామం నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక బట్టలు లేకుండా (forced to walk back home naked) నడుచుకుంటూ వెళ్తున్న వీడియో క్లిప్‌ను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పక్క గ్రామానికి చెందిన నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. నలుగురు నిందితుల్లో ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 7న తన మేనకోడలుపై అత్యాచారం చేసినందుకు భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తి FIR నమోదు చేసాడు. మేము ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు, అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెతో అలాంటి సంఘటనను నిరాకరించారు. అయినప్పటికీ, విచారణ జరిగింది” అని మొరాదాబాద్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) చెప్పారు.రేప్ సమాచారం అందుకున్న భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది మరియు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది' అని ఎస్పీ తెలిపారు.