యూపీలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) షాహారన్‌పూర్‌లో ఈమధ్య అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. అయితే.. టాయిలెట్ గదుల్లో (Food Served To Kabbadi Players In Toilet) భద్రపర్చిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 16వ తేదీన కొందరు అమ్మాయిలే ఈ వీడియోను బయటకు రిలీజ్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. టాయ్‌లెట్‌లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్ ముక్కపై నుంచి పూరీలను అమ్మాయిలు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని తీసుకుని బయట ఆహారం వండిన స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లి వాళ్లు తింటున్నారు. నిమిషం నిడివి ఉన్న వీడియోలో అక్కడి పరిస్థితులు ఘోరంగా కనిపించాయి.
ఈ వీడియో తీవ్ర దుమారం రేపి విమర్శలు వెల్లువెత్తడంతో షాహారన్‌పూర్ క్రీడాఅధికారి అనిమేష్ సక్సేనా స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయి. పైగా ఆ సమయంలో వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్ పూల్ వద్ద వంటలు చేయించాం. అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే రూంలో అని ఆయన వెల్లడించారు. టాయిలెట్ లో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు.
Here's Video
Taking cognizance of the viral videos and the pictures, Saharanpur sports officer Animesh Saxena has been suspended. A probe has been ordered. pic.twitter.com/UuOWkKAqRi
— Piyush Rai (@Benarasiyaa) September 20, 2022
ఇదిలా ఉంటే వీడియోను చూసిన చాలామంది అధికారులపై మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. షాహారన్‌పూర్ క్రీడాఅధికారి అనిమేష్ సక్సేనాపై వేటు వేసింది. కబడ్డీ ఆటగాళ్ల కోసం మరుగుదొడ్డిలో ఆహారాన్ని భద్రపర్చడం, గత్యంతరం లేని స్థితిలో అక్కడే వాళ్లు వడ్డించుకోవడం లాంటి ఘోర పరిస్థితులతో ఉన్న వీడియో వైరల్ కావడం యూపీలో తీవ్ర విమర్శలకు దారి తీసింది.