UP Shocker: ఘోర విషాదం, భార్యను గట్టిగా కౌగిలించుకుని వీపు మీద కాల్చిన భర్త, ఛాతీ నుంచి బయటకు దూసుకొచ్చిన అదే బుల్లెట్‌కు భర్త కూడా బలి

ఫోన్ విషయంలో గొడవపడిన భర్త...భార్యను చంపాలని తుపాకీతో కాల్చి చివరకు అదే బుల్లెట్‌కు తానూ కూడా బలైపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మొరాదాబాద్‌(Moradabad)లోని బిలారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఖాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

Alabama Shooting

Lucknow, June 16: యూపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫోన్ విషయంలో గొడవపడిన భర్త...భార్యను చంపాలని తుపాకీతో కాల్చి చివరకు అదే బుల్లెట్‌కు తానూ కూడా బలైపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మొరాదాబాద్‌(Moradabad)లోని బిలారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఖాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనేక్‌ పాల్‌ ( Anek Pal) అనే వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుమన్‌, నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సుమన పాల్ ఫోన్‌ (mobile phone) పోగొట్టుకుంది. ఈ విషయమై భర్త తరచూ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం ఇంట్లో పూజ ముగిసిన తర్వాత.. మరోసారి ఫోన్‌ గురించి అనేక్‌ పాల్‌ భార్యతో గొడవపడ్డాడు.

గుండె స‌ర్జ‌రీ చేసి శరీరంలోనే కత్తులను వదిలేసిన డాక్టర్లు, పేషెంట్ మృతి, ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి ఫ్యామిలీ

ఈ క్రమంలో సహనం కోల్పోయిన అనేక్‌ పాల్‌.. తన భార్యను (Suman Pal) గట్టిగా కౌగలించుకుని.. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆమె వీపుపై కాల్చాడు. అయితే, ఆమె ఛాతీ నుంచి బయటకు దూసుకొచ్చిన బుల్లెట్‌ అనేక్‌ పాల్‌కు తగలడంతో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. కాల్పుల శబ్దం విని అనేక్‌ పాల్‌ ఇంట్లోకి వచ్చిన స్థానికులు భారాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

ఆపరేషన్ థియేటర్లో మత్తులో ఉన్న మహిళపై దారుణం, ప్రైవేటు భాగాలపై, ఛాతిపై నొక్కుతూ వైద్యుడు లైంగికదాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లలను సంరక్షణాలయానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.