Doctors Leave Scissors Inside Body After Surgery: జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండె సర్జరీ చేసిన డాక్టర్లు శరీరంలోనే సర్జికల్ కత్తుల్ని(Surgical Scissors) వదిలివేసినట్లు రాజస్థాన్‌కు చెందిన కుటుంబం ఆరోపించింది. జైపూర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయినట్లు ఓ వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు.
ఆపరేషన్ తర్వాత తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, సర్జరీ జరిగిన 12 రోజుల తర్వాత అతను చనిపోయాడని, దహనం తర్వాత చితాభస్మం కోసం శ్మశానవాటికకు వెళ్తే ఆ ప్రాంతంలో సర్జికల్ కత్తులు దొరికినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు.
ఆస్పత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేయగా..జవహార్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో మృతుడి ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా ఆధర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఫిర్యాదుపై కమిటీ దర్యాప్తు చేపట్టనున్నది.
Here's News
#Doctors accused of leaving #scissors inside body after #surgery in #Jaipur hospital, patient dies https://t.co/K2TQ8c0UIQ
— The Tribune (@thetribunechd) June 16, 2023
ఫోర్టిస్ హాస్పిటల్ జోనల్ డైరెక్టర్ నీరవ్ భన్సల్ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తమ వద్ద సర్జరీ జరిగిన తర్వాత ఎక్స్‌రే రిపోర్టులు ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఎటువంటి సర్జికల్ వస్తువులు లేవన్నారు.