Pig heart transplant receipent (Photo-IANS)

Second recipient dies in US 40 days after surgery: పంది గుండెను అమర్చిన అమెరికా వ్యక్తి లారెన్స్ ఫాసెట్ (58) దురదృష్టవశాత్తూ మరణించారు. వైద్యులు ఆపరేషన్ చేసిన 40 రోజుల తరువాత ఆయన మృతి చెందారు. కాగా ఫాసెట్ గుండె పూర్తిగా విఫలం కావడంతో యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 20న ఫాసెట్‌కు ఆపరేషన్ నిర్వహించి పంది గుండె అమర్చిన సంగతి విదితమే.

మనిషికి పంది గుండె, అద్భుతం చేసిన అమెరికా వైద్యులు, ప్రపంచంలోనే ఇలాంటి ఆపరేషన్ తొలిసారి, అబ్జర్వేషన్‌ లో పేషెంట్‌, సక్సెస్ అయితే అవయవమార్పిడిలో సరికొత్త చరిత్ర

మనిషికి అనుకూలంగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి ఈ గుండెను సేకరించారు. గతేడాది ప్రపంచ వైద్య చరిత్రలోనే మొదటిసారిగా డేవిడ్‌ బెన్నెట్‌(57) అనే వ్యక్తికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పంది గుండెను అమర్చారు. అతడు కూడా సుమారు రెండు నెలలు మాత్రమే జీవించాడు.

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి, ఆపరేషన్ జరిగిన రెండు నెలలకు కన్నుమూసిన పేషెంట్, ఎలా చనిపోయాడని పరిశోధిస్తున్న వైద్యులు, చరిత్రలో అరుదైన ఆపరేషన్ ఫెయిల్

కాగా, ఆపరేషన్ జరిగిన తొలినాళ్లల్లో ఫాసెట్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆ తరువాతి రోజుల్లో పంది గుండెను ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించడం (ఆర్గాన్ రిజెక్షన్) ప్రారంభించిందని వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స తరువాత రోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆర్గాన్ రిజెక్షన్ అన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.