UP Shocker: అన్నకు సహకరించిందంటూ..తల్లిదండ్రుల ముందే బాలికపై 8 మంది అత్యాచారం, బాలికతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్న నిందితుడు, యూపీలో అమానుష ఘటన, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే 8 మంది సామూహికంగా అత్యాచారానికి (Moradabad girl raped by eight of family) పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది.
Lucknow, July 7: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే 8 మంది సామూహికంగా అత్యాచారానికి (Moradabad girl raped by eight of family) పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. యూపీ పోలీసులు, TOI కథనం ప్రకారం... అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి, పొరుగింటి అమ్మాయితో కలిసి జూన్ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు.
వారు వెళ్లిన తరువాత జూన్ 29వ తేదీన వీరివురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ క్రమంలో అమ్మాయి తరపున వాళ్లు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. వారిద్దరు లేచిపోవడానికి తన అన్నకు సహాయపడిందనే అనుమానంతో అతని చెల్లెలను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆ బాలిక తల్లిదండ్రుల ఎదురుగానే ఆమెపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
అనంతరం ఓ నిందితుడు ఆ బాలిక ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. ఈ ఘటనతో షాక్ తిన్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, వారు తొలుత ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)